Andhra Pradesh: గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,340FansLike
57,764FollowersFollow

ఉండవల్లి నివాసంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, గుమ్మడి సంధ్యారాణి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

అధికారులు ఇప్పటివరకు చేపట్టిన చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గంజాయి సాగు విస్తీర్ణం తగ్గుదలపై సభ్యులు సమీక్షించారు. సరిహద్దు రాష్ట్రాల్లో గంజాయి రవాణాను అరికట్టేందుకు సమన్వయం పెంచాలని సూచించారు. కొండ ప్రాంతాల్లో సాగును గుర్తించేందుకు శాటిలైట్ చిత్రాలు, డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించారు.

గంజాయి, మాదకద్రవ్యాల వినియోగ దుష్పరిణామాలపై విద్యాసంస్థల్లో నెలలో ఒక శనివారం అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అక్రమ రవాణా నెట్ వర్క్ ఆర్థిక మూలాలను ఛేదించి నేరస్తులపై ఉక్కుపాదం మోపాలని ఉపసంఘం స్పష్టం చేసింది. కేసులపై త్వరితగతిన ఛార్జిషీట్లు వేసి శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి హాట్ స్పాట్లను గుర్తించాలని, గిరిజనులను గంజాయి సాగు నుంచి దూరం చేయడానికి ఐటీడీఏ, గిరిజన సంక్షేమ శాఖలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కేసుల పురోగతి, నిఘా సమాచారం, శాటిలైట్, డ్రోన్ విశ్లేషణ కోసం ఆర్టీజీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్యాష్‌బోర్డు రూపొందించాలని ఆదేశించారు.

గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని నిర్ణయించారు. మత్తుకు బానిసలైన వారిని రక్షించేందుకు ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డి-అడిక్షన్ కేంద్రాల నిర్వహణకు సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రివర్గ ఉపసంఘం ఆదేశించింది.

సినిమా

సైలెంట్‌గా స్టార్‌డమ్ దిశగా భాగ్యశ్రీ బోర్సే..

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్‌డమ్ అందరికీ ఒకే విధంగా రాదు. కొందరు ఒక్క సినిమాతోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిపోతారు. మరికొందరు మాత్రం ఒక్కో సినిమా, ఒక్కో...

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

జగన్‌పై ప్రశాంత్ కిషోర్ .. తీవ్ర వ్యాఖ్యలు వైరల్

రాజకీయ వ్యూహకర్త Prashant Kishor తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddyపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్...

“తెలియకుండానే అవుట్?: ‘AK47’లో మ్యూజిక్ డైరెక్టర్ మార్పుపై షాక్ ట్విస్ట్”

Venkatesh Daggubati హీరోగా, Trivikram Srinivas దర్శకత్వంలో రూపొందుతున్న AK47 సినిమాకు సంబంధించి మ్యూజిక్ డిపార్ట్‌మెంట్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్ట్‌కు మొదటగా Harshavardhan Rameshwar మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నట్టు తెలిసిందే....

‘విజయ్ గెలుపుతో హీరోల రాజకీయాల హైప్?’… వాస్తవం ఏమిటి?

తమిళనాడులో Vijay రాజకీయ విజయం సాధించడంతో దక్షిణ భారత సినీ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. ఆయన పార్టీ టీవీకే గణనీయమైన స్థానాలు సాధించడంతో, ఇతర సినీ తారలు కూడా రాజకీయాల్లోకి వస్తారా...

ఎన్నికల ఫలితాలపై పవన్ కళ్యాణ్ స్పందన… మార్పు కోరుకున్న ఓటర్ల తీర్పు స్పష్టం

దేశంలోని నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో వెలువడిన ఎన్నికల ఫలితాలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan స్పందించారు. ఓటర్లు మార్పును బలంగా కోరుకున్నారని, పాలన నచ్చితే తిరిగి గెలిపిస్తారు,...

Peddi: ‘పెద్ది’ అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ‘జూన్ 4’న సినిమా విడుదల

Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇటివలే షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో సినిమా అఫిషియల్ రిలీజ్ డేట్...