“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,455FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు నిర్వహించిన 17 ఎస్ఐపీబీ సమావేశాల్లో మొత్తం 283 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రానికి రూ.11,37,222 కోట్ల పెట్టుబడులు రానుండగా, 10,01,147 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

పరిశ్రమల రంగంలోనే అత్యధికంగా 85 ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.4,44,442 కోట్ల పెట్టుబడులు రానుండగా, 3,28,907 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వెల్లడించింది.

ఇంధన రంగంలో కూడా భారీ పెట్టుబడులు నమోదయ్యాయి. మొత్తం 82 ప్రాజెక్టులకు ఆమోదం తెలపగా, వీటి ద్వారా రూ.3,87,809 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. ఈ రంగంలోనే అత్యధికంగా 4.62 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 52 ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా రూ.2,85,347 కోట్ల పెట్టుబడులు రానుండగా, 1,82,126 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పర్యాటక రంగంలో 42 ప్రాజెక్టుల ద్వారా రూ.9,639 కోట్ల పెట్టుబడులు, 17,558 ఉద్యోగాలు రానున్నాయి.

ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 20 ప్రాజెక్టులకు ఆమోదం లభించగా, రూ.8,322.98 కోట్ల పెట్టుబడులతో 8,450 మందికి ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన శాఖలో 2 ప్రాజెక్టుల ద్వారా రూ.1,666 కోట్ల పెట్టుబడులు, 2,050 ఉద్యోగాలు లభించనున్నాయి.

ఇప్పటికే రూ.5 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు పూర్తయ్యాయని, ప్రస్తుతం పలు పారిశ్రామిక యూనిట్లు నిర్మాణ దశలో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, వేగవంతమైన అనుమతులు, పారిశ్రామిక మౌలిక వసతులు కారణంగా అంతర్జాతీయ, జాతీయ సంస్థలు ఏపీ వైపు మొగ్గు చూపుతున్నాయని ప్రభుత్వం చెబుతోంది.

సినిమా

‘దిల్ రాజు వర్సెస్ మైత్రీ కోల్డ్ వార్ వల్లే సమస్యలు’: నట్టి...

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం కొనసాగుతున్న నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల సమస్యలపై సీనియర్ నిర్మాత నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం...

Producers Guild: ఇన్నాళ్లూ గుర్తురాని సమస్య ‘పెద్ది’ వస్తుంటే గుర్తొచ్చిందా?: రవిశంకర్

Producers Guild: తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పర్సంటేజీ వివాదంపై ఇప్పుడు మరో వర్గం తన వాదన వినిపించింది. నిన్న తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఓ...

‘కలెక్షన్లు పెరిగాయి.. కానీ ప్రేక్షకులు తగ్గారు’: బన్నీ వాస్

తెలుగు సినీ పరిశ్రమ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్మాత Bunny Vas చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. థియేటర్ల ఆదాయం తగ్గిపోవడం, ప్రేక్షకులు సినిమాలకు...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు...

The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ రీషూట్స్..! ఏం జరుగుతుందో క్లారిటీ...

The Paradise: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది ప్యారడైజ్’. ఇప్పటికే చాలా భాగం తెరకెక్కిన సినిమా ఇంకా కొంత భాగం...

రాజకీయం

పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ భారీ గిఫ్ట్.. 31 మందికి ఉచిత ఉన్నత విద్య

Pawan Kalyan పిఠాపురం నియోజకవర్గ విద్యార్థులకు మరో కీలక నిర్ణయంతో అండగా నిలిచారు. పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో...

సాక్షులను బెదిరించిన కేసు ప్రభావం.. అనంతబాబు బెయిల్ రద్దు

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో గతంలో సుప్రీంకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం రద్దు చేసింది....

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న జనసేన నేత ప్రేమ్ కుమార్

హనుమాన్ జయంతి సందర్భంగా అల్లాపూర్ డివిజన్ వివేకానంద నగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం కమిటీ చైర్మన్ మరియు సభ్యుల ఆహ్వానం...

ప్రసంగించడానికి వెళ్లి పెట్టుబడులు తెచ్చిన చంద్రబాబు.. అమరావతిలో EY ఎంట్రీ!

అమరావతిని అంతర్జాతీయ స్థాయి ఐటీ మరియు ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి N. Chandrababu Naidu విజన్‌కు మరో కీలక ముందడుగు పడింది. ప్రపంచ ప్రఖ్యాత కన్సల్టింగ్, ఐటీ సంస్థ Ernst &...

ఎక్కువ చదివినవి

ఒమాన్‌లో చిక్కుకున్న షానవాజ్‌ను సురక్షితంగా ఇంటికి చేర్చిన జనసేనాని!

“ఒక వీడియో చూసి వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్”.. అన్నమయ్య జిల్లా వాయల్పాడుకు చెందిన శ్రీమతి షానవాజ్ కొన్ని రోజుల క్రితం ఒమాన్‌లో ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందుల గురించి భావోద్వేగ వీడియో ద్వారా సహాయం...

పవన్ కళ్యాణ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ ఏం చర్చించారు.?

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కి ఇటీవల సైనస్ సమస్య నేపథ్యంలో సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. చాలాకాలంగా పవన్ కళ్యాణ్ సైనస్ సమస్యతో బాధపడుతున్నారు. చిన్నప్పటినుంచీ వున్న సమస్యే అయినా,...

మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్‌ .. పెదపాడు పిల్లలకు కొత్త స్కూల్ భవనం

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan ఇచ్చిన మరో హామీ కార్యరూపం దాల్చింది. అరకు నియోజకవర్గంలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలో శిథిలావస్థకు చేరిన ప్రాథమిక పాఠశాల స్థానంలో కొత్త భవనం నిర్మాణం పూర్తయింది....

వెంకటేష్ – కళ్యాణ్‌రామ్ సినిమాకు జివి ప్రకాష్ అదిరే ట్యూన్స్!

టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో దర్శకుడు Anil Ravipudi తెరకెక్కిస్తున్న వెంకటేష్ - కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్ ఒకటి. ఇటీవల Mana Sankara Vara Prasad Garu సినిమాతో భారీ...

Daily Horoscope: మేష రాశివారికి ఉద్యోగంలో శుభవార్తలు.. కుంభ రాశివారికి ధనలాభ సూచనలు

మే 9 , 2026 శనివారం రాశిఫలాలు: ఈరోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. కుటుంబం, ఉద్యోగం,...