ఎంత అభిమాని అయితే మాత్రం .. ఏకంగా బుగ్గ కొరకలా అంటూ ఫైర్ అవుతున్నారు జనాలు. ఇంతకీ అభిమాని బుగ్గ కొరికిన యాంకర్ ఎవరో తెలుసా .. వర్షిణి. తెలుగులో హీరోయిన్ గా ఓ సినిమాలో నటించిన వర్షిణికి ఆ సినిమా పెద్దగా వర్కవుట్ కాలేదు .. దాంతో యాంకరింగ్ రంగంలోకి వచ్చి తక్కువ సమయంలోనే మంచి పేరు తెచ్చుకుంది.
ప్రస్తుతం ఈటివి షోలో యాంకర్ గా చేస్తుంది. తాజాగా ఈటివి 2లో ప్రసారం అవుతున్న పటాస్ షోలో యాంకర్స్ గా రవి, శ్రీముఖి ఇద్దరు ఈ షో చేసేవారు .. అయితే ఈ మద్యే బిగ్ బాస్ మూడో సీజన్ లో శ్రీముఖి కంటెస్టెంట్ గా పాల్గొనడంతో ఆ ప్లేస్ లో కి వర్షిణిని తెచ్చారు. వర్షిణి తో పాటు జబర్దస్త్ చంటి ఓ షో చేస్తున్నారు.
తాజాగా పటాస్ షో లో యాంకర్ వర్షిణి ఓ అభిమాని బుగ్గ కొరికింది. తాజాగా ఈ షో లో యాంకర్స్ అడిగిన ప్రశ్నలకు అందులో పాల్గొన్న స్టూడెంట్ సమాధానాలు ఇచ్చారు. అందులో ఓ అబ్బాయిని స్టేజి పైకి పిలిచి .. బుగ్గ కొరికింది వర్షిణి. ఈ సంఘటనతో అక్కడున్న జనాలు షాక్ అయ్యారు.
