పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమా మళ్లీ వేగం పుంజుకుంది. చాలా ఏండ్లుగా పెండింగ్ లో పడ్డ ఈ సినిమాను ఇప్పుడు పరుగులు పెట్టిస్తున్నారు. డైరెక్టర్ క్రిష్ తప్పుకున్న తర్వాత జ్యోతికృష్ణ ఆ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి పవన్ తో అవసరం లేని కొన్ని సీన్లను షూట్ చేశారు. ఇక నెలల గ్యాప్ తర్వాత పవన్ కూడా రీసెంట్ గానే సెట్ లో అడుగు పెట్టారు. ఓ యాక్షన్ సీన్ ను కంప్లీట్ చేసేశారు. త్వరలోనే ఆయన మళ్లీ సెట్స్ లో అడుగు పెడతారని అంటున్నారు. పవన్ తో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారంట.
అయితే ఈ సాంగ్ లో టాలీవుడ్ హాట్ యాంకర్ కమ్ యాక్టర్ అయిన అనసూయ స్టెప్పులేయనుందని తెలుస్తోంది. ఈ స్పెషల్ సాంగ్ ఒక రకంగా ఐటెం సాంగ్ లాగానే ఉంటుందని చెబుతున్నారు. దీనికోసం ఇప్పటికే లిరిక్స్, సాంగ్ కంపోజింగ్ కూడా జరుగుతున్నాయంట. త్వరలోనే సాంగ్ షూటింగ్ జరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. అయితే అనసూయ పేరును ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అనసూయ కూడా గతంలో కొన్ని ఐటెం సాంగ్స్ చేసింది. ఇప్పుడు పుష్ప-2తో ఆమె క్రేజ్ కూడా పెరిగింది.
కాబట్టి ఆమె స్టెప్పులేస్తే మాత్రం కచ్చితంగా సినిమాకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారంట. వీరమల్లు సినిమాను ఎట్టి పరిస్థితుల్లో మార్చి 28కి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.