ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు పెద్ద దుమారమే రేపుతోంది. ఓ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను ఆయన రేప్ చేశాడంటూ కేసు నమోదైన సంగతి తెలిసింది. దాంతో ఆయన మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అటు జనసేన పార్టీ ఇప్పటికే ఆయన్ను సస్పెండ్ చేసింది. ఇక కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి కూడా జానీ మాస్టర్ ను తొలగించారు. దాంతో పాటు ఫిల్మ్ ఛాంబర్ కూడా ఈ కేసు విచారణ కోసం ఓ కమిటీని వేసింది. ఇక తాజాగా ఈ ఇష్యూమీద స్టార్ నటి అనసూయ కూడా స్పందించారు.
ఆమె మాట్లాడుతూ.. నేను పుష్ప సెట్స్ లో ఆ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ను చూశాను. ఆమె చాలా ట్యాలెంటెడ్. ఇలాంటి క్లిష్ట పరిస్థితులు ఆమె ట్యాలెంట్ ను ఏ మాత్రం తగ్గించలేవు. ఆమెకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఇలాంటి వేధింపులపై ఎవరూ అదైర్య పడొద్దు. ధైర్యంగా పోరాడాలి. అప్పుడే న్యాయం జరుగుతుంది అంటూ అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గతంలో ఇదే అనసూయ తనమీద కూడా ఇలాంటి వేధింపులు వచ్చాయని.. వాటి కారణంగా రెండేళ్ల పాటు అవకాశాలు రాలేదంటూ ఆమె తెలిపింది.
ఇక ఎప్పుడూ వివాదాల్లోనే ఉండే అనసూయ ప్రస్తుతం ఇలాంటి కామెంట్స్ చేయడంతో అంతా షాక్ అవుతున్నారు. అనసూయ బాధితురాలి వైపు ఇలా నిలబడటం చాలా మంచి పని అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక అటు జానీ మాస్టర్ వైఫ్ కూడా దీనిపై స్పందించారు. జానీ మాస్టర్ ను తొక్కేయడానికే కుట్ర చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు.