Anasuya : జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న అనసూయ ఆ తర్వాత ఎన్నో బుల్లి తెర కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించింది. బుల్లి తెర ద్వారా వచ్చిన పాపులారిటీతో వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంటున్న విషయం తెల్సిందే. తాజాగా అనసూయ విమానం అనే సినిమాలో నటించింది.
రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఎలా అయితే కనిపించిందో అలాగే విమానం సినిమాలో కనిపించబోతుంది. ఈ సినిమాలో పేట సుమతి అనే పాత్రలో కనిపించబోతుంది. చీర కట్టులో కాస్త హాట్ గా మాస్ ఆంటీ పాత్రలో అనసూయ ఈ సినిమాలో కనిపించబోతుందని ఆమె సినమా స్టిల్స్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది.
ఈ మధ్య కాలంలో విమానం సినిమా గురించి మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటిస్తున్న విమానం సినిమాలో అనసూయ పాత్ర కచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుందని అంటున్నారు. ఒక విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాను జూన్ 9న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అనసూయ కారణంగా సినిమా కు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. తద్వారా మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి.