సినీ నటులు, యాంకర్లు అని తేడా లేకుండా సెలబ్రిటీల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్య పదజాలంతో సామజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతోన్న వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 17న నిందితుడి తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది యాంకర్ అనసూయ. ఒక నకిలీ ట్విట్టర్ ఖాతా ద్వారా నటీమణుల, యాంకర్లపై ఇబ్బందికర పోస్టులు పెడుతున్నాడంటూ పోలీసుల దృష్టికి తీసుకెళ్లింది.
దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు నిందితుడు 267 హీరోయిన్ల ఫోటోలను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసినట్లు గుర్తించారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసారు. నిందితుడు ఆంధ్రప్రదేశ్ లోని కోనసీమ జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు.
ఇటీవలే ఇలా సెలెబ్రిటీ మహిళలను ఇబ్బంది పెట్టే విధంగా మార్ఫింగ్ ఫోటోలు చేయడం ఎక్కువైంది. యాంకర్ అనసూయ ముందుకొచ్చి పోలీసుల దృష్టికి తీసుకురావడంతో నిందితుడి ఆట కట్టినట్లయింది.