Anant Ambani: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ (Mukhesh Ambani) ఇంట జరుగుతున్న అనంత్ అంబానీ (Anant Ambani)-రాధికా మర్చంట్ (Radhika Merchant) పెళ్లిసందడి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే జరిగిన ప్రీ-వెడ్డింగ్, సంగీత్.. తదితర వేడుకలు ఆసక్తి రేకెత్తించాయి. నేడు వీరి పెళ్లి ముంబైలోని జియో సెంటర్లో అంగరంగ వైభవంగా జరుగబోతోంది. పెళ్లికి అవుతున్న ఖర్చు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వివాహానికి రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ఫోర్బ్స్ అంచనా వేస్తున్నట్టుగా వార్త. ఇది అంబానీ నికర విలువలో 0.5శాతం మాత్రమేనని తెలుస్తోంది. కింగ్ చార్లెస్, కిమ్ కర్దాషియన్.. వంటి మోస్ట్ సెలబ్రిటీస్ కూడా వివాహానికి హాజరవుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖులను వివాహ వేదిక వద్దకు తరలించేందుకు మూడు ఫాల్కన్-2000 జెట్స్ సిద్ధం చేసారు.
దేశ, విదేశీ ఫ్యాషన్ డిజైనర్లతో అత్యంత ఖరీదైన పెళ్లి దుస్తుల్లో అనంత్-రాధిక మెరిసిపోతున్నారు. రిలయన్స్ ఉద్యోగులకు ప్రత్యేకంగా వెడ్డింగ్ గిఫ్టులు కూడా పంపించారు. వేడుకల్లో భాగంగా సామూహిక వివాహాలు జరిపించారు. భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించారు.