యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో బేబీ కాంబో రిపీట్ అవుతోంది. ఆనంద్, వైష్ణవి కలిసి నటిస్తున్న ఈ సినిమాను ఆదిత్య హాసన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ కొత్త మూవీ పూజా కార్యక్రమం నేడు హైదరాబాద్ లో నిర్వహించారు. పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక క్లాప్ కొట్టి మూవీని ప్రారంభించింది. స్టార్ డైరెక్టర్ వెంకీ అట్లూరి, కల్యాణ్ శంకర్ కథను డైరెక్టర్ కు అందించారు.
నటుడు శివాజీ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. రెగ్యులర్ షూటింగ్ జూన్ నుంచి స్టార్ట్ కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి నటించిన బేబీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ మూవీ లవ్ ఫెయిల్యూర్ కథతో వచ్చి మంచి హిట్ అయింది. ఇప్పుడు వస్తున్న మూవీ కూడా మంచి లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లోనే వస్తోంది. ఈ మూవీతో మరోసారి మ్యాజిక్ రిపీట్ అవుతుందని ఆనంద్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.



