పరకామణి చోరీపై ఆనం ఘాటు విమర్శలు… జగన్ వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహం

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,217FansLike
57,764FollowersFollow

టీటీడీ పరకామణి చోరీ ఘటనపై మంత్రివర్గ సభ్యుడు ఆనం రాంనారాయణరెడ్డి మరోసారి వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చిన్న వ్యవహారంగా చెప్పి భక్తుల విశ్వాసాలను తక్కువ చేసి మాట్లాడడం బాధాకరమని ఆయన అన్నారు. పరకామణి చోరీని చిన్న అంశంగా చూస్తే, తన దృష్టిలో పెద్ద దోపిడీ ఏంటో కూడా జగనే చెప్పాలని ఆనం మండిపడ్డారు. 70 వేల రూపాయలు దొంగిలించిన వ్యక్తి.. రాజీ కోసం కోట్ల విలువైన ఆస్తులు ఎలా రాసుకున్నాడో ప్రజలకు చెప్పాల్సిందిగా ప్రశ్నించారు.

జగన్ పాలనలో పరకామణి చోరీ నిరంతర ప్రక్రియగా సాగిందనీ, ఒక రోజు మాత్రమే సీసీ కెమెరాల్లో కనిపించిన దొంగ.. మొత్తం వ్యవస్థలో ఉన్న రేణువులాంటివాడేనని ఆనం వ్యాఖ్యానించారు. పవిత్రమైన తిరుమలలో పాలచుక్క కూడా లేకపోయినా ప్రసాదానికి నెయ్యి కనిపెట్టడం జగన్ పాలనలో జరిగిన పెద్ద వింత అని ఎద్దేవా చేశారు. దొంగ చేతికి తాళాలు ఇస్తే ఎలా ఉంటుందో గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు చూసారని ఆయన అన్నారు.

టీటీడీపై జగన్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రజలు ఇంకా మర్చిపోని ఐదు సంవత్సరాల మాఫియా పాలనను గుర్తుకు తెస్తున్నాయన్నారు. ప్రతి వ్యవస్థలో బంధు గణాన్ని పెట్టి దోపిడీకి తలుపులు తెరిచారని ఆరోపించారు. స్వామివారి ప్రసాదం వంటి పవిత్రమైన వ్యవస్థలలో కూడా దగా జరిగినట్లు విమర్శించారు. దొంగే దొంగా అని పరిగెత్తినట్లే జగన్ వ్యవహారం ఉందని ఆనం వ్యాఖ్యానించారు.

మొత్తానికి, జగన్.. మాఫియా సామ్రాజ్యానికి అధినేత కావడంతో వాస్తవాలు వినడానికే సిద్ధంగా లేరని, అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆ సామ్రాజ్యాన్ని కట్టడి చేస్తుందని మంత్రి ఆనం స్పష్టం చేశారు. పరకామణి చోరీ వ్యవహారంపై నిజాలు బయటపడతాయని, భక్తుల నమ్మకాన్ని నిలబెట్టడం ప్రభుత్వ బాధ్యతేనని తెలిపారు.

Live Link: https://youtube.com/live/IarYNbiKSTE?feature=share

సినిమా

కుబేర తర్వాత శేఖర్ కమ్ముల కొత్త సినిమా.. హీరో ఎవరో త్వరలోనే!

దర్శకుడు శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రానికి సంబంధించిన పనులను వేగవంతం చేశారు. తాజా సమాచారం ప్రకారం, కొత్త సినిమా కథను పూర్తిగా లాక్ చేసిన...

Mohanlal: వివాదంలో హీరో మోహన్ లాల్..! అటవీశాఖ కీలక నిర్ణయం

Mohanlal: మలయాళ చిత్రసీమ అగ్రకథానాయకుడు మోహన్ లాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే ఆయనపై ఏనుగు దంతాలు కలిగి ఉన్నారనే కేసు ఉంది. వన్యప్రాణుల కొమ్ములు,...

Jr Ntr: ‘మొదలే కాలేదు..’ వివాదంలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా

Jr Ntr: యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ‘గాడ్ ఆఫ్ వార్’గా పిలుస్తున్న సినిమాకు టైటిల్...

Rajendra Prasad: ‘ఇస్తే గౌరవం.. అడిగితే భిక్ష..’ పద్మశ్రీ అవార్డుపై రాజేంద్రప్రసాద్...

Rajendra Prasad: నవ్వులరేడుగా తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో ముద్ర వేసుకున్న నటకిరీటి రాజేంద్రప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వం ఇటివలే గౌరవ ‘పద్మశ్రీ’ పురస్కారం అందించిన సంగతి...

చిన్న సినిమాలకు అన్యాయం జరుగుతోంది.. స్టార్ హీరోలు స్పందించాలి: షెరాజ్ మెహదీ

తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాయని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ అన్నారు. హైదరాబాద్‌లో తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా...

రాజకీయం

విశాఖలో ఎల్‌జీ జీసీసీకి లోకేష్ ఆహ్వానం.. శ్రీసిటీలో పెట్టుబడుల విస్తరణపై చర్చ

సియోల్ (సౌత్ కొరియా): ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్ తయారీ, పరిశోధన, అభివృద్ధి రంగాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలోని ఎల్‌జీ...

ఏపీలో ఈవీ సెమీకండక్టర్స్ హబ్‌కు లోకేష్ ఆహ్వానం..

సియోల్ (సౌత్ కొరియా): ఆంధ్రప్రదేశ్‌ను ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్స్, అధునాతన ఆటోమోటివ్ తయారీ రంగాలకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ...

పవన్‌పై ఫిర్యాదు.. నెటిజన్ల నుంచి కౌంటర్ల వర్షం!

సుగాలి ప్రీతి తల్లి పార్వతి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం రాజకీయంగానే కాకుండా సోషల్ మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికలకు ముందు న్యాయం...

ఏపీలో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయండి.. సియోల్ సెమీకండక్టర్స్‌కు లోకేష్ ఆహ్వానం

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్‌లో సియోల్ సెమీకండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో డిస్‌ప్లే...

జోసెఫ్ రావణ్‌కు బెయిల్.. యూఏపీఏ కేసులో ఊరట

యూఏపీఏ (UAPA) కింద నమోదైన కేసులో అంబేద్కరైట్ జర్నలిస్టు, స్వతంత్ర రాజకీయ వ్యాఖ్యాత జోసెఫ్ రావణ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) సంస్థకు, ఆ సంస్థకు చెందిన నాయకుడు...

ఎక్కువ చదివినవి

Horoscope: వృషభ రాశికి ఆర్థిక పురోగతి.. కుంభ రాశికి శుభవార్త

జులై 7, 2026 మంగళవారం రాశిఫలాలు: చంద్రమాన పంచాంగం ప్రకారం ఈరోజు గ్రహాల సంచారం కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించనుండగా, మరికొన్ని రాశుల వారు ఓర్పుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందుతారు....

హైదరాబాద్‌లో బీఫ్‌ను మటన్‌గా విక్రయం..? ఇద్దరు అరెస్ట్.. 50 కిలోల మాంసం స్వాధీనం

హైదరాబాద్‌లో ఆహార భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. బీఫ్‌ను మటన్‌గా కలిపి నగరంలోని పలు హోటళ్లకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై తెలంగాణ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఈ కేసులో...

శ్రీలీల హిందీ సినిమాకు బ్రేకులు.. రిలీజ్ ఎప్పుడో ఇంకా క్లారిటీ లేదు

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు వరుస అవకాశాలతో బిజీగా కనిపించిన శ్రీలీలకు ఇటీవల కొత్త ప్రాజెక్టులు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో కార్తీక్ ఆర్యన్ హీరోగా, దర్శకుడు అనురాగ్ బసు...

ఉద్యోగాల కోసం కాదు.. ఉద్యోగాలు ఇచ్చే వారిగా ఎదగండి: లోకేష్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన జాతీయ విద్యా విధానం, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, వికసిత్ భారత్–2047 వంటి కార్యక్రమాలు దేశాన్ని విజ్ఞాన ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు నడిపిస్తున్నాయని, అదే స్ఫూర్తితో...

Chiranjeevi-Rajinikanth: ‘బాక్సాఫీస్ టైటన్స్..’ మరోసారి ‘చిరంజీవి-రజినీకాంత్’ క్లాష్

Chiranjeevi-Rajinikanth: సినిమాలకెప్పుడూ మంచి సీజన్ రిలీజ్ అవసరం. అన్ సీజన్లో రిలీజై వండర్స్ క్రియేట్ చేసిన సినిమాలూ ఉన్నాయి. కానీ, సంక్రాంతి, వేసవి, దసరా, దీపావళి, క్రిస్మస్.. ఇలా పండగ సీజన్లలో సెలవులు...