రాజకీయ ప్రత్యర్థుల మీదకు దుష్టచతుష్టయం.. అనే అస్త్రాన్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, 2024 ఎన్నికల సమయంలో ప్రయోగించారుగానీ, అది కాస్తా వైసీపీకే గట్టిగా తగిలింది. వైసీపీనే దుష్టచతుష్టయంగా భావించి, 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడేశారు రాష్ట్ర ప్రజలు.
ఇక, ఆ దుష్టచతుష్టయం వికృత క్రీడలు రోజురోజుకీ కొత్త మార్గాల్ని వెతుక్కుంటున్నాయి.. రాష్ట్రాన్ని అస్థిరపరిచేందుకు.! తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడిన సంగతి తెలిసిందే.
ఈ తరహా దుర్ఘటనలు అత్యంత దురదృష్టకరం. పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినా, ఇలా ఎందుకు జరిగిందన్నదానిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. పలువురు అధికారుల మీద ఇప్పటికే వేటు వేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో విపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి వుంటుంది.
కానీ, విపక్షం వైసీపీ అలా ఎందుకు బాధ్యతగా వ్యవహరిస్తుంది.? శవ రాజకీయాలకు అలవాటు పడిన పార్టీ కదా.? ఇక్కడా అదే చేసింది. మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చెబుతున్నదాన్నిబట్టి, బాధితుల్ని ఆసుపత్రిలో పరామర్శించే క్రమంలో జగన్ దుష్టచతుష్టయం, బాధితులకు తెల్ల కవర్లు ఇచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధితులతో మాట్లాడించే ప్రయత్నం చేసిందట.
వైసీపీ దుర్మార్గానికి సంబంధించి విజువల్స్ సీసీటీవీలో నమోదయ్యాయని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చెబుతున్నారు. ఇంత దిగజారుడు రాజకీయం, ఇలాంటి శవ రాజకీయం.. ఇంతకుముందెవరూ చేసి వుండరన్నది మంత్రిగారి వాదన.
వైఎస్ జగన్, ఆసుపత్రికి వెళ్ళడానికి ముందు, దుష్టచతుష్టయంలోని వ్యక్తులు ఆసుపత్రిలోకి తమ అనుచరుల్ని పంపి, బాధితులకు తెల్ల కవర్లు ఇచ్చి, వారితో ప్రభుత్వంపై విమర్శలు చేయించేందుకు ప్రయత్నించారని ఆనం రాంనారాయణరెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఆ దుష్టచతుష్టయమే టీటీడీని భ్రష్టుపట్టించిందంటూ ఆనం రాంనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైఎస్ జగన్ సహా, ఆ దుష్టచతుష్టయంలో వున్నదెవరు.? అన్నదానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా, దుష్ట చతుష్టయంలో వున్న వ్యక్తుల విషయమై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
జగన్ స్విమ్స్ పర్యటన, క్షతగాత్రుల పరామర్శ అంశంపై సంచలన విషయాలు బయటపెట్టిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
జగన్ పరామర్శకు ముందు ఆసుపత్రిలో బాధితులకు డబ్బుల కవర్లు ఇచ్చి చంద్రబాబును తిట్టాలని చెప్పారన్న మంత్రి ఆనం
డబ్బుల కవర్లు ఇస్తున్న దృశ్యాలు ఆసుపత్రి సిసి టీవీ కెమేరాల్లో రికార్డు… pic.twitter.com/wKDO3yt9xe
— TeluguBulletin.com (@TeluguBulletin) January 10, 2025