Legends: మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అమెరికాలో జరిగిన ఆస్కార్ వేడుకల నుంచి నేరుగా నిన్న ఢిల్లీ చేరుకున్న రామ్ చరణ్ ఇండియా టుడే కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందే అమిత్ షాను కలుసుకున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్ర విశేషాలతోపాటు సినిమా ఆస్కార్ అవార్డు అందుకున్నందుకు ఆయన్ను అభినందించారు.
‘భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు చిరంజీవి, రామ్ చరణ్ ను కలవడం ఆనందంగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశ సంస్కృతి మరియు ఆర్ధిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసింది. నాటు-నాటు పాటకు ఆస్కార్ మరియు RRR చిత్రం అద్భుత విజయం సాధించినందుకు రామ్ చరణ్ కు అభినందనలు’ అని పేర్కొన్నారు. ఈక్రమంలో అమిత్ షా చేసిన ట్వీట్ అభిమానులను ఆనందంలో ముంచెత్తింది. చిరంజీవి, రామ్ చరణ్ ను లెజెండ్స్ గా పేర్కొంటూ ఆయన చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది.
తెలుగు సినిమా కమర్షియల్ రేంజ్ పెంచి చిరంజీవి తనదైన ముద్ర వేశారు. నెంబర్ వన్ హీరోగా దశాబ్దాలుగా తన హవా కొనసాగిస్తున్నారు. అటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటారు. ఇప్పుడు రామ్ చరణ్ ఏకంగా అంతర్జాతీయస్థాయిలో ప్రభావం చూపిస్తున్నారు. ఇటివల ఆస్కార్ వేడుకల సమయంలో అమెరికన్లను కూడా రామ్ చరణ్ ఆకర్షించారు. ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా సైతం రామ్ చరణ్ ను ‘గ్లోబల్ స్టార్’ గా అమెరికా మీడియా సంస్థలు.. ‘బ్రాడ్ పిట్ ఆఫ్ ఇండియా’గా కీర్తించడం రామ్ చరణ్ హవాకు కొలమానంగా నిలుస్తున్నాయి.
త్వరలో తాను హాలీవుడ్ సినిమా చేసే అవకాశం ఉందని.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని రామ్ చరణ్ ప్రకటించడం అభిమానులను ఉత్తేజపరుస్తోంది. దీంతో అటు చిరంజీవి, ఇటు రామ్ చరణ్ తెలుగు సినిమా స్థాయిని పెంచడంతో అమిత్ షా ఇద్దరినీ లెజెండ్స్ గా వ్యవహరించారని చెప్పాలి. ప్రస్తుతం రామ్ చరణ్ చేస్తున్న శంకర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. తర్వాత బుచ్చిబాబు సనాతో చేయబోయే సినిమా కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండబోతోందని స్వయంగా వెల్లడించారు. రామ్ చరణ్ ఇస్తున్న హై తో అభిమానుల ఆనందానికి అవధుల్లేవని చెప్పాలి.
Delighted meeting @KChiruTweets and @AlwaysRamCharan – two legends of Indian Cinema.
The Telugu film industry has significantly influenced India's culture & economy.
Have congratulated Ram Charan on the Oscar win for the Naatu-Naatu song and the phenomenal success of the ‘RRR’. pic.twitter.com/8uyu1vkY9H
— Amit Shah (@AmitShah) March 17, 2023
భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు @KChiruTweets మరియు @AlwaysRamCharan లను కలవడం ఆనందంగా ఉంది.
తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశ సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసింది.
నాటు-నాటు పాటకు ఆస్కార్ మరియు RRR చిత్రం అద్భుత విజయం సాధించినందుకు రాంచరణ్ ను అభినందించారు. pic.twitter.com/eyLWuq3xmM
— Amit Shah (@AmitShah) March 17, 2023