టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 చిత్రం దాదాపుగా రెండు వేల కోట్లను వసూళ్లు చేసిన విషయం తెల్సిందే. వందేళ్ల సినీ చరిత్రలో ఆ స్థాయి వసూళ్లు సాధించిన సినిమా లేదనే చెప్పాలి. కాని తాజాగా అమితాబచ్చన్ తన పాత సినిమా అమర్ అక్బర్ ఆంథోనీ 43 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆ సినిమా అప్పట్లోనే 7.25 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఆ మొత్తం ఇప్పటి లెక్కల ప్రకారం చూసుకుంటే బాహుబలి 2 సాధించిన మొత్తం కంటే అధికమే అంటూ అమితాబ్ కామెంట్ చేశాడు.
ఈ సందర్బంగా ఆ సినిమాకు సంబంధించిన కొన్ని ఫొటోలు మరియు జ్ఞాపకాలను అమితాబ్ నెమరవేసుకున్నాడు. అప్పట్లో ఈ సినిమాలో హేమా హేమీలు నటించడంతో బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద విజయాన్ని ఈ చిత్రం దక్కించుకుంది. రిషి కపూర్, వినోద్ ఖన్నా, షబానా అజ్మీ, నీతూ కపూర్, పర్వీన్ బాబీ, ప్రాణ్, నిరుపమ్ రాయ్ వంటి ప్రముఖులు నటించారు.
ఈ సినిమాలో నటించిన నటీనటులు మరియు పలువురు సాంకేతిక నిపుణులు ప్రస్తుతం మన మద్య లేకున్నా కూడా సినిమా మాత్రం ఇంకా బుల్లి తెరపై వచ్చినప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉంది.
T 3544 -43 YEARS .. !!! .. 'Amar Akbar Anthony' is estimated to have made Rs 7.25 crore in those days. Inflation-adjusted, it crosses the collections of Bahubali 2—The Conclusion today!
#43YearsOfAmarAkbarAnthony pic.twitter.com/u5IMiOV2zt
— Amitabh Bachchan (@SrBachchan) May 27, 2020
635712 713398Generally the New york Weight Loss diet is undoubtedly less expensive and flexible staying on your diet scheme intended for measures nevertheless quick then duty keep a nutritious day-to-day life. weight loss 35052