America: అమెరికా (America) లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తెలుగు విద్యార్ధినిపట్ల సియాటిల్ నగరానికి చెందిన పోలిస్ అధికారి చులకనగా మాట్లాడటంపై భారత్ (India) తీవ్రంగా స్పందించింది. సంబంధిత వీడియోలో అధికారి సంభాషణ ఆధారంగా దర్యాప్తు చేపట్టాలని అమెరికాను కోరుతూ శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం (Indian Consulate in San Francisco) ట్వీట్ చేసింది.
‘విద్యార్ధిని మృతిపై సదరు అధికారి తీరు తీవ్ర ఆక్షేపణీయం. వాషింగ్టన్ (Washington) లోని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తూ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నా’మని పేర్కొంది.
కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి (23) డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉన్నత చదువుల కోసం 2021లో అమెరికా వెళ్లింది. ఈ ఏడాది జనవరి 23న కళాశాలకు వెళ్లి రాత్రి ఇంటికి వెళ్తూండగా రోడ్డు దాటే క్రమంలో పోలిసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై పోలిసు అధికారి చులకనగా మాట్లాడటం ఆయనకు అమర్చిన కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పుడవి వెలుగులోకి రావడంతో ఆయనపై విచారణ జరుగుతోంది.
Hello there! I could have sworn I’ve been to this website befpre but after
ging thrtough a few of tthe popsts I realized it’s nnew too me.
Nonetheless, I’m definitely pleased I discovered itt aand I’ll bbe book-marking
iit annd checking back frequently!