Switch to English

గోరంట్ల మాధవ్ ఒప్పుకోలేదుగానీ, అంబటి రాంబాబు ఒప్పేసుకున్నారే.!

91,316FansLike
56,994FollowersFollow

‘ఆ వీడియోలో వున్నది నేను కాదు..’ అంటూ హిందూపురం ఎంపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గోరంట్ల మాధవ్ నానా యాగీ చేసిన విషయం విదితమే. ఇటీవల ఆయనకు చెందినదిగా చెప్పబడుతున్న ఓ న్యూడ్ వీడియో కాల్ బయటకు రావడంతో పెను రాజకీయ దుమారమే చెలరేగింది. వైసీపీ సర్కారు కిందా మీదా పడింది. పోలీసు వ్యవస్థ కూడా మల్లగుల్లాలు పడింది. చివరికి ‘ఒరిజినల్ వీడియో దొరకలేదు.. ప్రచారంలో వున్నదైతే ఒరిజినల్ కాదు..’ అని పోలీసులు తేల్చారు. దాన్ని ‘క్లీన్’ చిట్‌గా గోరంట్ల మాధవ్ భావిస్తున్నారు.

ఇదిలా వుంటే, మంత్రి అంబటి రాంబాబు మాత్రం, ‘ఆ బొమ్మ నాదే’ అని ఒప్పేసుకున్నారు. గతంలో అంబటి రాంబాబుకి సంబంధించి ఓ ఆడియో టేపు బయటకు వచ్చింది. ‘అరగంట.. సుకన్య..’ ఇలా ఏవేవో మాటలున్నాయి అందులో. అప్పట్లో, అదంతా తన మీద జరిగిన కుట్రలో భాగమేనని అంబటి రాంబాబు బుకాయించారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తానన్నారు, చేశారో లేదో తెలియదు.

ఇక, అసలు విషయానికి వస్తే.. జనసేన నేత నాగబాబు, సోషల్ మీడియా వేదికగా మంత్రి అంబటి రాంబాబుని ‘బఫూన్’గా అభివర్ణిస్తూ, ఓ పొటో షేర్ చేశారు. జనసేన పార్టీ 175 సీట్లలోనూ పోటీ చేస్తుందో లేదో చెప్పాలంటూ పవన్ కళ్యాణ్ మీద అంబటి సెటైరికల్ ట్వీటేయడంపై నాగబాబు స్పందిస్తూ, ‘మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్న వేస్తావేంటయ్యా బఫూన్..’ అంటూ రిటార్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇక, నాగబాబు షేర్ చేసిన ఫొటోపై స్పందించిన మంత్రి రాంబాబు, ‘ఖాళీ చేసుకుని నా బొమ్మ గీసినందుకు థ్యాంక్స్’ అంటూ ట్వీటేశారు. సో, అంబటి తనంతట తానుగా నాగబాబు షేర్ చేసిన బొమ్మని తనదని అంగీకరించారన్నమాట. ‘అదీ మార్పు అంటే.. అట్లా రావాలి బాబాయ్. వాయిస్ నీది కాదు అని బుకాయించినా, ఫేస్ నీదే అని ఒప్పుకున్నావ్ జోకర్ అంబటి రాంబాబు బాబాయ్. మీ క్యారెక్టర్ అదే.. ఎప్పటికి అయినా ఆ జగన్ దృష్టిలో. ఇంతకీ తమరి ఖాళీ సమయాన్ని ఎక్కడ వినియోగిస్తున్నారో..’ అంటూ జనసేన మహిళా నేత రాయపాటి అరుణ సోషల్ మీడియా వేదికగా మంత్రి అంబటి రాంబాబు మీద సెటైరేశారు.

అయినా, జనసేన పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తే అంబటి రాంబాబుకి ఎందుకు.? గత ఎన్నికల్లో, ‘ఒక్క ఛాన్స్..’ అంటూ సొంత నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అభిమానుల్ని సైతం వేడుకున్న (కంటతడి పెట్టి మరీ) అంబటి రాంబాబు, ఇలా పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేసి అభాసుపాలవుతున్నారన్నది జనసైనికుల వాదన

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

ఈ అవార్డు నాకెంతో ప్రత్యేకం.. జీవితాంతం సినిమాల్లోనే: చిరంజీవి

‘గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవాల్లో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేదని బాధపడ్డా.. ఇప్పుడు ఇక్కడే అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు ఇచ్చినందుకు...

ఆ స్టార్ హీరో మనసులో కృతి సనన్..! వరుణ్ ధావన్ కామెంట్స్...

హీరోయిన్ కృతి సనన్ ను ఓ స్టార్ హీరో ప్రేమిస్తున్నారనే అర్ధం వచ్చేలా హీరో వరుణ్ ధావన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీంశమయ్యాయి. తాను హీరోగా...

మరోసారి తాతైన కామెడీ కింగ్ బ్రహ్మానందం

టాలీవుడ్ టాప్ కమెడియన్, కామెడీ కింగ్ బ్రహ్మానందం మరోసారి తాత అయ్యారు. ఆయన కొడుకు గౌతమ్, కోడలు జ్యోత్స్న మరోసారి తల్లిదండ్రులు అయ్యారు. గతంలో వీరికి...

నరేష్ మూడో భార్యపై కేసు నమోదు చేసిన పవిత్ర లోకేష్

ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను అడ్డుపెట్టుకుని తనను కించపరిచే...

అన్నంలో చీమలు ఉన్నాయని గొడవ… చివరికి భర్తను చంపేసిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ప్రతీ కాపురంలోనూ గొడవలు ఉంటాయి. కానీ నేటి పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలకు సైతం...

రాజకీయం

అమరావతిపై సుప్రీం ఏం చెప్పింది.? వీళ్ళకి ఏం అర్థమయ్యింది.?

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ సర్కారుకి ఊరట.! కాదు కాదు, హైకోర్టుకే మొట్టికాయలు వేసిన సుప్రీంకోర్టు.! పచ్చ బ్యాచ్ అమరావతి నుంచి మూటాముళ్ళు సర్దుకోవాల్సిందే.! ఏపీకి మూడు రాజధానులు తథ్యం.! సుప్రీం...

అమరావతిపై సుప్రీం.! ఇంతకీ షాక్ ఎవరికి.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట దక్కింది. అది కూడా రాజధాని అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకి సంబంధించి. ఆ తీర్పు ఏంటి.? ఆ కథ ఏంటి.? అన్న విషయాల గురించి పూర్తి...

ఎవరి కాళ్ళ దగ్గర ఎవరు చోటు కోరుకుంటున్నారు పేర్ని నానీ.!

రాజకీయాల్లో విమర్శలు సహజమే కావొచ్చు.! విమర్శించడమే రాజకీయమనుకుంటే ఎలా.? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద ‘చంద్రబాబుకి బానిస’ అంటూ పదే పదే పేర్ని నాని విమర్శిస్తూ వస్తుంటారు. ఇలా విమర్శించినందుకే ఫాఫం...

వైఎస్ షర్మిల అరెస్టు.. ఉద్రిక్తత..! కార్యకర్తల నిరసన..

వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలోంని లింగగిరిలో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె పాదయాత్ర చేస్తూండగా ఆమెను అరెస్టు...

ఏర్పాట్లు పూర్తయ్యాక ఆపుతారా..? సభకు వెళ్తా.. ఎలా ఆపుతారో చూస్తా..: బండి సంజయ్

నిర్మల్ జిల్లా భైంసాలో జరిగే ప్రజా సంగ్రామ యాత్రకు తనను అడ్డుకోవడంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డారు. నేటి సభకు ఖచ్చితంగా వెళ్తానని తేల్చి చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం కరీంనగర్...

ఎక్కువ చదివినవి

సుధీర్ బాబు ‘హంట్’కు హాలీవుడ్ యాక్షన్ టచ్

సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేష్‌ దర్శకత్వం వహించారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ సినిమా...

అన్నంలో చీమలు ఉన్నాయని గొడవ… చివరికి భర్తను చంపేసిన భార్య

భార్యాభర్తల మధ్య గొడవలు రావడం అనేది అత్యంత సహజమైన విషయం. ప్రతీ కాపురంలోనూ గొడవలు ఉంటాయి. కానీ నేటి పరిస్థితుల్లో చిన్న చిన్న కారణాలకు సైతం చంపుకునే స్థితికి వెళ్లిపోతుండడం దారుణం. ఒడిశాలోని...

నరేష్ మూడో భార్యపై కేసు నమోదు చేసిన పవిత్ర లోకేష్

ప్రముఖ సినీ నటి పవిత్ర లోకేష్ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతిపై ఫిర్యాదు చేసింది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ను అడ్డుపెట్టుకుని తనను కించపరిచే విధంగా వీడియోలు చేయిస్తోందని రమ్యపై పవిత్ర...

ఇప్పటం వివాదం: పవన్ కళ్యాణ్ అంత పెద్ద నేరం చేశారా.?

ఇప్పటం గ్రామ ప్రజలు, తమ ఇళ్ళను ప్రభుత్వం కుట్ర పూరితంగా ధ్వంసం చేసిందని ఆరోపించారు. బస్సులు తిరిగే పరిస్థితి లేని గ్రామంలో వున్నపలంగా 120 అడుగుల మేర రోడ్లను వెడల్పు చేయాల్సిన అవసరమేముంది.?...

రైల్వే ఉద్యోగి కక్కుర్తి..! 500 నోటును 20గా చూపించి మోసం..! ఎక్కడంటే..?

రైల్వే స్టేషన్లో ఓ బుకింగ్ క్లర్క్ తన వక్ర బుద్ది చూపించి ఓ ప్రయాణికుడిని మోసం చేయాలని చూసి అడ్డంగా బుక్కయ్యాడు. 500 రూపాయల నోటును 20 రూపాయల నోటుగా చూపి మోసం...