మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాలో ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండటంలో ఆయన దిట్ట. గత జగన్ ప్రభుత్వంలో కూడా ఎన్నో సార్లు ఆయన వివాదంలో చిక్కుకున్నారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా ఆయన నిత్యం మీడియా ముందుకు వస్తూనే ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా స్పందిస్తున్నారు. కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటున్న ఆయన.. ఇప్పుడు తాజాగా తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. ఇందులో ప్రత్యేకం ఏముంది అనుకోకండి.
ఆయన అక్కడ పెద్దగా ఏమీ మాట్లాడలేదు. కేవలం వచ్చి వెళ్తేనే ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆయన నార్మ్ ల్ గా రాలేదు. జగన్ స్టిక్కర్ ఉన్న డ్రెస్ వేసుకుని వచ్చారు. దీంతో ఇదే ఇప్పుడు పెద్ద రచ్చ లేపుతోంది. ఎందుకంటే టీటీడీ నియమాల ప్రకారం ఏ పార్టీ స్టిక్కర్, జెండా, పార్టీ లీడర్ ఫొటోలు, స్టిక్కర్లు తీసుకురావొద్దు. అది రూల్స్ కు విరుద్ధం. కానీ అంబటి మాత్రం ఇలా జగన్ స్టిక్కర్ తో రావడంతో.. కావాలనే వచ్చాడేమో అంటూ కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి లడ్డూ విషయంలో నానా రచ్చ జరుగుతోంది.
అది తెలిసి కూడా ఆయన ఇలా రావడం వెనకాల అర్థమేంటని తలలు పట్టుకుంటున్నారు. ఆయన మరో వివాదం రాజేయడం కోసమే ఇలా వచ్చాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై టీటీడీ గానీ, అటు కూటమి ప్రభుత్వం గానీ ఏమైనా స్పందిస్తుందా లేదా చూడాలి.