Switch to English

‘పెయిడ్‌ రగడ: వైసీపీ ఎమ్మెల్యే రోజాకి ‘అమరావతి’ సెగ.!

అమరావతిలో ఆందోళనలు చేస్తున్నది రైతులు కాదనీ, పెయిడ్‌ ఆర్టిస్టులనీ గతంలో సినీ నటి, వైసీపీ ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయిన విషయం విదితమే. ‘అమరావతి ఉద్యమంలో మహిళల్ని ముందు పెట్టి, ఆడింగుల్లా చోద్యం చూస్తున్నారు..’ అంటూ రోజా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు గతంలోనే.

ఈ వ్యవహారంపై రోజాకి, అమరావతిలోనే షాకిచ్చారు రాజధాని అమరావతి ప్రాంత రైతులు. ఓ అధికారిక కార్యక్రమంలో పాల్గొనేందుకు అమరావతి వచ్చిన రోజాకి, ‘సేవ్‌ అమరావతి’ నినాదాలతో ఝలక్‌ ఇచ్చారు మహిళలు. ‘పెయిడ్‌ ఆర్టిస్టులని మమ్మల్ని విమర్శించిన రోజా క్షమాపణ చెప్పాల్సిందే..’ అంటూ మహిళలు నినదించేసరికి, పోలీసులు ఒకింత ఆందోళన చెందారు. ఎమ్మెల్యే రోజాని, వెనుక గేటు గుండా మరో వాహనంలో పంపించేయాల్సి వచ్చింది. దాంతో, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

మరోపక్క, ‘టీడీపీ గూండాలు నా మీద దాడికి యత్నించారు.. మహిళా ఎమ్మెల్యేనైనా నా మీద ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారా.?’ అంటూ రోజా గుస్సా అయ్యారు. రోజా వ్యాఖ్యలపై అమరావతి రైతాంగం మరోమారు భగ్గుమంది. ‘మేం రైతులం.. మీలా మేం పెయిడ్‌ ఆర్టిస్టులం కాదు.. పూటకో పార్టీ మార్చే రాజకీయ నాయకులం కూడా కాదు.. పదవుల కోసం కక్కుర్తిపడేవాళ్ళం అసలే కాదు.. మీరు మీ ముఖ్యమంత్రికి భజన చేస్తారేమో పదవుల కోసం.. మేం, మా అమరావతి కోసం పోరాడుతున్నాం.. ప్రాణాల్ని సైతం లెక్కచేయం..’ అంటూ అమరావతి రైతులు, రోజాకి తమదైన స్టయిల్లో సమాధానమిస్తున్నారు.

ఇదిలా వుంటే, అమరావతి ప్రాంతంలో మరోమారు డ్రోన్లు కలకలం రేపుతున్నాయి. ఓ ఇంటిపైనా, బాత్రూవ్‌ు సమీపంలోకి డ్రోన్‌ రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ మహిళ స్నానం చేస్తుండగా, డ్రోన్‌లో చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ పోలీసులతో వాగ్యుద్ధానికి దిగారు మహిళలు. ఈ క్రమంలో పోలీసులు, కొందరిపై లారీలు ఝులిపించారనీ, పలువురికి గాయాలయ్యాయనీ బాధితులు చెబుతున్నారు.

సినిమా

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

రాజకీయం

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

లబ్ధిదారుల ఎంపికలో చెప్పేదొకటి.. జరుగుతోంది మరొకటి

‘‘ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవలకు ఆస్కారమివ్వం. ఈ ప్రక్రియ మొత్తం పూర్తి పారదర్శకంగా జరుగుతుంది. వాలంటీర్లే నిబంధనల ప్రకారం అర్హులను ఎంపిక చేస్తారు. నాకు ఓటేయనివారికి కూడా మా ప్రభుత్వ...

ఏపీలో బలవంతపు మత మార్పిడులపై ఏకిపారేసిన నేషనల్ మీడియా

రఘురామకృష్ణంరాజు.. భారతీయ జనతా పార్టీ సానుభూతిపరుడు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ. ఇంగ్లీషు మీడియం విషయంలోనూ, ఇతరత్రా అనేక విషయాల్లోనూ అధికార పార్టీకి కొరకరాని కొయ్యిలా తయారయ్యారు ఈ ఎంపీ. నిజానికి, రఘురామకృష్ణంరాజు...

కేసీఆర్‌పై పోరాటంలో జనసేనాని, బీజేపీతో కలిసొస్తారా.?

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి వ్యతిరేకంగా నినదిస్తారా.? అదే జరిగితే, పవన్‌ కళ్యాణ్‌ సినిమాల పరిస్థితి తెలంగాణలో ఏమవుతుంది.? ఈ చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ...

ఎక్కువ చదివినవి

కరోనా అలర్ట్‌: తెలుగు రాష్ట్రాలు చాలా చాలా బెటరేగానీ.??

తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య నిలకడగా కొనసాగుతోంది. ప్రతిరోజూ 50 కేసులకు అటూ ఇటూగా తెలుగు రాష్ట్రాల్లో నమోదవుతున్నాయి. పొరుగున వున్న తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలే కాదు, ఒరిస్సాలోనూ కేసుల...

రంజాన్‌ ‘నైట్‌ మార్కెట్‌’కి కరోనా చీకట్లు.!

హైద్రాబాద్‌ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది బిర్యానీ.. దాంతోపాటే, రంజాన్‌ స్పెషల్‌ అయిన హలీం. ఇంకో స్పెషల్‌ కూడా వుంది రంజాన్‌ సందర్భంలో. అదే నైట్‌ బజార్‌. హైద్రాబాద్‌లోని పాత బస్తీలోగల చార్మినార్‌ ప్రాంతంలోని...

ఫ్లాష్ న్యూస్: ఎల్జీ పాలిమర్స్ కు సుప్రీం కోర్టులో చుక్కెదురు.!

విశాఖపట్నం, ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్ నుంచి అర్థరాత్రి లీకైన స్టెరీన్ గ్యాస్ వలన 12మంది చనిపోగా, కొన్ని వందల మంది అనారోగ్యం పాలైన ఘటన అందరికీ తెలిసిందే. ఈ విషయంపై స్పందిస్తూ...

మరో విషాదం: ది గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ ఇకలేరు.!

అలనాటి తెలుగు హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో పాటు నేటి తరం హీరోలైన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్...

జగన్ క్లాప్ కొట్టాడు, కేసీఆర్ ఎప్పుడో?

రెండు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు ఏపీ లో సినిమా సీరియల్స్ ఇతర షోల షూటింగ్స్ కు అనుమతులు ఇస్తూ ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు ప్రకటన జారీ చేసింది. అయితే తెలుగు...