పన్నెండేళ్ళ ఎదురు చూపులకు శుభం కార్డు: ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,480FansLike
57,764FollowersFollow

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది 2014లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుందో, లేదో తెలియని దుస్థితి. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ గతంలో, అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ, తీర్మానం చేసింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్.. అమరావతికి అనుకూలంగా మాట్లాడారు.

కాలగమనంలో, అమరావతితోపాటు మరో రెండు రాజధానులు తెరపైకి తెచ్చి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు ముక్కలాట ఆడారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలోనే, మూడు రాజధానులకు అనుకూలంగా తీర్మానం చేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి హోదాలో.

కానీ, ఆ మూడు రాజధానులకు న్యాయస్థానాల్లో చుక్కెదెరయ్యింది. మూడు రాజధానుల బిల్లు కూడా వెనక్కి తీసుకోబడింది. మరోమారు, అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో తీర్మానం చేయడం జరిగింది.

ఈసారి, అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి చేరింది. పార్లమెంటు ఉభయ సభల్లో, అమరావతికి చట్టబద్ధత కల్పించేలా, విభజన చట్టానికి సవరణలు చేయడం గమనార్హం. పార్లమెంటు ఉభయ సభల ఆమోదం నేపథ్యంలో, రాష్ట్రపతి కూడా అమరావతికి ఆమోద ముద్ర వేశారు.

రాజముద్ర పడింది.. పుష్కర కాలం తర్వాత, రాజధాని ఏదన్న ప్రశ్నకు సరైన సమాధానం దొరికింది ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు. ఏకైక రాజధాని అమరావతి మాత్రమే. ఇప్పుడిక, చంద్రబాబు సర్కార్ ముందున్న లక్ష్యం..  రాజధాని అమరావతిలో అభివృద్ధిని పరుగులు పెట్టించడమే.

రాజధానికి చట్టబద్ధత కల్పించాల్సిన పరిస్థితి రావడం, ఈ క్రమంలో నానా రకాల ఇబ్బందులూ తలెత్తడం.. ఇదంతా ఓ ప్రసహనం. ఏ కారణంతో అమరావతికి వైఎస్ జగన్ మోకాలడ్డినా, అదీ ఓ రకంగా మంచిదే అయ్యింది. అమరావతికి, కేంద్రమే చట్టబద్ధత కల్పించిందిప్పుడు.

‘ప్రభుత్వం మారితే, అసెంబ్లీలో ఇంకో తీర్మానం చేస్తాం..’ అంటూ రాజధానిని మార్చేస్తామనే సంకేతాల్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘మావిగన్’ పేరుతో పంపుతున్నారుగానీ, అది ఇకపై కుదరని పని. వైఎస్ జగన్ డ్రామాలకు కాలం చెల్లింది. అమరావతి మాత్రమే, రాష్ట్రానికి ఏకైక రాజధాని.. అని డిసైడ్ అయిపోయింది.

బీజేపీ, టీడీపీ, జన సేన నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన అపురూపమైన కానుక, అమరావతికి చట్టబద్ధత.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు. రాజధానిపై ఇంకా విషం చిమ్మాలని వైసీపీ అనుకుంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

సినిమా

పర్సంటేజ్ వివాదానికి చెక్.. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఉన్న Telugu Film Chamber of Commerce కాన్ఫరెన్స్ హాల్‌లో శుక్రవారం నిర్మాతలు, ప్రదర్శకులు, పంపిణీదారుల సంయుక్త సమావేశం జరిగింది. ఉదయం...

Chiranjeevi-Vijay: సీఎం విజయ్ కు చిరంజీవి మధ్య ఆత్మీయ సంభాషణ..! వైరల్...

Chiranjeevi-Vijay: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి.. ఇటివలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధినేత విజయ్ కు మధ్య ఆత్మీయ సంభాషణ జరిగిందనే వార్త ఇప్పుడు...

Producers Guild: పెద్దికి లైన్ క్లియర్..! తెలుగు ఫిల్మ్ చాంబర్ కీలక...

Producers Guild: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పెద్ది’. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించిన...

‘తిమ్మరాజుపల్లి టివి’ నిర్మాతగా నాకు గొప్ప సంతృప్తిని ఇచ్చింది: కిరణ్ అబ్బవరం

గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన పీరియాడిక్ డ్రామా Thimmarajupalli TV ఇటీవల థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న సంగతి తెలిసిందే. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ హీరో...

“పెద్ది ట్రైలర్ ఎలా ఉండబోతోందో తెలుసా?”

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా Peddi పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు మే 18న విడుదల...

రాజకీయం

ఉమ్మడి అనంతపురం చరిత్రను మార్చేది ఏఎంసీఏ ప్రాజెక్టే: నారా లోకేష్

పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న ఏఎంసీఏ (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్ ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రనే మార్చబోతుందని మంత్రి Nara Lokesh అన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో...

ఇంట గెలవని నేతలు.. విజయ్ తో కొత్త రాజకీయ ప్రయోగమా?

దక్షిణాది రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై ఆసక్తికర చర్చ మొదలైంది. ముఖ్యంగా Y. S. Jagan Mohan Reddy, K. T. Rama Rao, Vijay పేర్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా...

“కేడర్ లేకపోతే మనం లేము.. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోవాలి”: నారా లోకేష్

అనంతపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో యువనేత Nara Lokesh పార్టీ కేడర్‌కు కీలక సందేశం ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై...

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్.. ఆర్డీటీ ఆసుపత్రి సందర్శనకు విశేష స్పందన

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లిలో ఉన్న ఆర్డీటీ ఆసుపత్రిని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి Nara Lokesh గురువారం సందర్శించారు. మంత్రి హోదాలో తొలిసారి ఆర్డీటీకి వచ్చిన లోకేష్‌కు...

రేపు సాధక్‌లతో పవన్ కళ్యాణ్ ఆత్మీయ భేటీ

జనసేన పార్టీ చేపట్టిన ‘ఉద్యమి’ సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో, సభ్యత్వ నమోదులో చురుకుగా పనిచేసిన సాధక్‌లతో ప్రత్యేక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం మంగళగిరిలో జరగనున్న...

ఎక్కువ చదివినవి

వెంకటేష్ – కళ్యాణ్‌రామ్ సినిమాకు జివి ప్రకాష్ అదిరే ట్యూన్స్!

టాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి బజ్ క్రియేట్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో దర్శకుడు Anil Ravipudi తెరకెక్కిస్తున్న వెంకటేష్ - కళ్యాణ్‌రామ్ మల్టీస్టారర్ ఒకటి. ఇటీవల Mana Sankara Vara Prasad Garu సినిమాతో భారీ...

Sirish: ‘పెద్ది’ రిలీజ్ టైమ్‌లోనే సమస్య గుర్తొచ్చిందా..? శిరీష్ వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు

రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలకు సిద్ధమవుతున్న వేళ తెలంగాణ థియేటర్ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా మల్టీప్లెక్స్‌ల తరహాలో పర్సంటేజీ విధానం...

అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపులో భారీ పురోగతి.. 97 శాతం పంపిణీ పూర్తి!

అమరావతి రాజధాని భూముల పూలింగ్‌కు సంబంధించిన ప్లాట్ల కేటాయింపుపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. రైతులకు ప్లాట్లు కేటాయించడం లేదంటూ వస్తున్న ఆరోపణల మధ్య ప్రభుత్వం విడుదల చేసిన తాజా వివరాలు ఇప్పుడు...

“నన్ను ఆపలేరు”.. పుకార్లపై శ్యామల ఆరే స్ట్రాంగ్ వార్నింగ్

వైఎస్సార్‌సీపీ నేత శ్యామల ఆరే సోషల్ మీడియా వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన రాజకీయ ప్రయాణంపై వస్తున్న ప్రచారాలు, పుకార్లకు ఘాటుగా స్పందించిన ఆమె.. తాను...

“పెద్ది” ప్రమోషన్స్‌పై ఆందోళన అనవసరం!

“పెద్ది” ప్రమోషన్స్‌పై చాలామంది ఆందోళన పడుతున్నారు. కొన్ని పెద్ద సినిమాలతో పోల్చుతూ “హైప్ లేదు”, “ప్రమోషన్స్ తక్కువ” అంటూ చర్చలు చేస్తున్నారు. అవును… ప్రమోషన్స్ సినిమాకు అవసరం. కానీ ప్రమోషన్స్ ఒక్కటే సినిమాను కాపాడలేవు. భారీ ప్రమోషన్స్ చేసి...