ప్రస్తుతం మీడియాల్లో పెద్ద దుమారం రేపుతున్న ఏకైక విషయం అమల పాల్ న్యూడ్ గా నటించి షాకిచ్చిన టీజర్. ఆడై పేరుతొ తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమల పాల్ ఓ సన్నివేశంలో న్యూడ్ గా నటించి అందరికి షాకిచ్చింది. తాజాగా విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజంగా ఓ పాత్ర కోసం అమలా పాల్ ఇంత డేరింగ్ డెసిషన్ తీసుకున్నందుకు అందరు ఆమెను ప్రశంశల్లో ముంచెత్తుతున్నారు. ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా కనిపించి అమలా పాల్ అందరికి షాక్ ఇవ్వడం విశేషం.
అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఆరాలు మొదలయ్యాయి. ఒకే ఒక్క టీజర్ తో పెద్ద దుమారమే రేపిన ఆడై సినిమా కోసం అమలా పాల్ ఏకంగా 20 రోజులపాటు న్యూడ్ గానే ఉందట. ఆ సన్నివేశాల కోసం అన్ని రోజులు పట్టాయంట మరి !! ఏకంగా 20 అంటే షాక్ అవుతున్నారు కాదు. విన్న మనకే ఇలా ఉంటె .. అక్కడ షూటింగ్ లో ఆమె పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
అమలా పాల్ న్యూడ్ సీన్స్ తో ఈ సినిమా క్రేజ్ పదింతలు పెరిగింది, కానీ అమలా ఫాన్స్ మాత్రం .. ఇంకా షాక్ లోనే ఉన్నారట. అమలా మరి అంత న్యూడ్ గా నటించడం వారికీ మింగుడు పడడంలేదు. ఈ టీజర్ విడుదలై కేవలం కొన్ని గంటల్లోనే మిలియన్స్ వ్యూస్ సాధించి సినిమా పై భారీ అంచనాలు పెంచేసింది. ఇప్పటికే సెన్సార్ వాళ్ళు కూడా సర్టిఫికెట్ ఇచ్చారట. అయితే ఇందులో అమలా పాల్ న్యూడ్ సన్నివేశాలు ఎంతవరకు ఉంటాయన్న విషయాన్నీ యూనిట్ మాత్రం ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి విడుదల తరువాత ఏ రేంజ్ సంచలనం రేపుతుందో చూడాలి.