సుధాకర్ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా శ్యామ్ మండల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అం అః’. (ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్) ట్యాగ్‌లైన్. రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్ పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ్రిల్లింగ్ సబ్జెక్టుతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ విడుదల చేశారు.
నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘దర్శకుడు శ్యామ్ నాకు చాలా ఏళ్ల నుంచి తెలిసిన వ్యక్తి. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన అం అః చిత్రం ట్రైలర్ చాలా బాగుంది. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. కొత్త టీమ్ తో తెరకెక్కిన సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఇటువంటి మంచి చిత్రాలను మరిన్ని తీయాలని కోరుకుంటున్నా’నని అన్నారు.
దర్శకుడు శ్యామ్ మాట్లాడుతూ.. ‘సక్సెస్ ఫుల్ నిర్మాత బెక్కెం వేణు గోపాల్ గారు మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్. సినిమాను అందరూ థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నాన’ని అన్నారు.
హీరో సుధాకర్ జంగం మాట్లాడుతూ.. ‘సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో సినిమా తెరకెక్కింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమాను అందరూ థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నాన’ని అన్నారు.
నిర్మాత శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. ‘మా సినిమా ట్రైలర్ విడుదల చేసిన బెక్కెం వేణుగోపాల్ గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. టీం ఎంతో కష్టపడి సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. సినిమాను జూలై చివరి వారంలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నామ’ని అన్నారు.
సినిమాకు సంగీతం సందీప్ కుమార్ కంగుల అందించారు. 152 సెకన్ల నిడివితో ఉత్కంఠభరితంగా సాగిన ట్రైలర్‌లో క్రైమ్, సస్పెన్స్, రొమాన్స్, కామెడీని చూపించారు. 24 గంటల్లో 20 లక్షలు ఎలా సంపాదిస్తారు..? అక్రమంగా ఇరుక్కున్న కేసు నుంచి హీరో అతని ఫ్రెండ్స్ ఎలా తప్పించుకున్నారు..? సిటీలో జరిగే హత్యలకు కారణం ఏంటి..? అనే అంశాలతో ట్రైలర్ సాగింది.