Allu Sirish: అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న సినిమా ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా సినిమా నిర్మించారు. శామ్ ఆంటోన్ దర్శకత్వంలో అడ్వెంచరస్ యాక్షన్ జోనర్లో తెరకెక్కిన సినిమా ఆగష్టు 2న విడుదలవుతోంది. ఈసందర్భంగా ‘బడ్డీ’ యూనిట్ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. కార్యక్రమంలో అల్లు శిరీష్ తోపాటు కమెడియన్ ఆలీ, దర్శకుడు, తదితరులు పాల్గొన్నారు.
అల్లు శిరీష్..”బడ్డీ” ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ, పిల్లలు, మాస్ ఆడియెన్స్ కూడా ఎంజాయ్ చేశారు. టికెట్ రేట్స్ ఎక్కువగా ఉండటంతో చాలామంది సెకండ్ వీక్ థియేటర్లకు వెళ్తున్నారు. అందుకే ‘బడ్డీ’కి సింగిల్ స్క్రీన్ రూ.99, మల్టీప్లెక్స్ రూ.125 టికెట్ రేట్స్ పెట్టాం. దాదాపు 200 మంది ఎగ్జిబిటర్లతో మాట్లాడి నిర్మాత జ్ఞానవేల్ రాజా తీసుకున్న నిర్ణయానికి థ్యాంక్స్ చెబుతున్నా’.
‘సినిమాలో టెడ్డీ బేర్ ఫస్ట్ హీరో.. నేను సెకండ్ హీరోలా ఉంటుంది. యాక్షన్, కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ బాగుంటాయి. టెడ్డీ అందరు హీరోల ఫ్యాన్. అందుకే కొన్ని ఫేమస్ డైలాగ్స్ పెట్టాం. ఆడియన్స్ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా’నని అన్నారు.