Allu Arjun: పుష్ప సినిమాతో జాతీయస్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. దీంతో ప్రస్తుతం ఆయన నటించిన పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటివలే పాట్నా, చెన్నైల్లో నిర్వహించిన ఈవెంట్స్ సక్సెస్ కావడంతో చిత్ర బృందంలో జోష్ వచ్చింది. ఈక్రమంలో అల్లు అర్జున్ సాధించిన అరుదైన ఘనత ప్రముఖంగా వార్తల్లో నిలుస్తోంది.
ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇండియా-2024 ప్రకారం అత్యధిక పారితోషికం అందుకున్న భారతీయ హీరోల టాప్-10 జాబితాలో అల్లు అర్జున్ మొదటి స్థానంలో నిలవడం విశేషం. పుష్ప 2: ది రూల్ సినిమా కోసం ఆయన రూ.300కోట్లు పారితోషికం అందుకున్నట్టు ఫోర్బ్స్ కథనం ప్రచురించింది. ప్రస్తుతం ఈవార్త సంచలనం రేపుతోంది.
అల్లు అర్జున్ తర్వాత విజయ్ 130-175కోట్లు, షారుఖ్ 150-250కోట్లు, రజినీకాంత్ 150-270కోట్లు, అమీర్ ఖాన్ 100-275కోట్లు, ప్రభాస్ 100-200కోట్లు, అజిత్ 105-165కోట్లు, సల్మాన్ 100-150కోట్లు, కమల్ హాసన్ 100-150కోట్లు, అక్షయ్ కుమార్ 60-145కోట్లు.. తర్వాతి స్థానాల్లో నిలిచారని ఫోర్బ్స్ తన కథనంలో పేర్కొంది.