Allu Arjun : అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా హైదరాబాద్‌లో భారీ ఎత్తున ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అల్లు అర్జున్, సుకుమార్, రష్మిక, సుక్కు వైవ్ ఇంకా పలువురు ఎమోషనల్ అయ్యారు.
పుష్ప రెండు పార్ట్‌ల కోసం ఏకంగా ఐదేళ్ల సమయం తీసుకున్నారు. ఈ ఐదు సంవత్సరాల జర్నీ గురించి సుకుమార్ గురించి ఒక వీడియోను ప్రీ రిలీజ్ వేడుకలో ప్రసారం చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ సుకుమార్ భార్య కన్నీటి పర్యంతం అయ్యారు. ఆ తర్వాత సుకుమార్ మాట్లాడుతూ ఉన్న సమయంలో అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు. బన్నీపై తనకు ఉన్న ప్రేమతోనే పుష్ప ఈ స్థాయికి చేరిందని సుకుమార్ అన్నారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆ సమయంలో సుకుమార్ ఎమోషనల్ అయ్యారు. మొత్తానికి సుదీర్ఘమైన ఐదేళ్ల జర్నీ సాగించిన పుష్ప టీం మొత్తం పుష్ప 2 రిలీజ్ నేపథ్యంలో ఎమోషనల్‌గా బరస్ట్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒక సినిమా కోసం అన్నేళ్లు వర్క్ చేసినప్పుడు కచ్చితంగా ఎమోషనల్‌గా కనెక్ట్ కావడం కామన్.
ఆ జర్నీ ముగింపు దశకు వచ్చినప్పుడు ఎమోషనల్‌గా బరస్ట్ అవుతారు. అయితే వీరు మళ్లీ పుష్ప 3 కోసం కలిసే అవకాశాలు ఉన్నాయి. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పుష్ప 3 ఉంటుందని తెలుస్తోంది. మొత్తానికి పుష్ప 2 సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో రికార్డ్‌లు బద్దలు కొట్టేందుకు రెడీ అయ్యింది. రూ.2000 కోట్ల వసూళ్ల టార్గెట్‌తో విడుదలకు సిద్ధం అయ్యింది.