వరుస ఫ్లాప్స్ తర్వాత నితిన్ భీష్మతో సక్సెస్ కొట్టాడు. చాలా ఒత్తిడి ఉన్న సమయంలో భీష్మ సక్సెస్ రావడంతో నితిన్ చాలా రిలీఫ్ ఫీల్ అవుతున్నాడు. ఇటీవలే పెళ్లి ఫిక్స్ అయిన నితిన్‌కు ఈ సక్సెస్ మరింత జోష్‌ను నింపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సక్సెస్ నేపథ్యంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించాడు. చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశాడు.
కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సక్సెస్‌ను దక్కించుకున్న దర్శకుడు వెంకీ కుడుములకు కంగ్రాట్స్. రష్మిక ఆల్ రౌండర్ అని ఈ సినిమాతో మళ్లీ నిరూపించుకుంది. నా నిర్మాత వంశీ మరో సక్సెస్‌ను దక్కించుకున్నాడు. 2020 జనవరి మరియు ఫిబ్రవరి నీకు మంచి సక్సెస్‌లు దక్కాయి అన్నాడు. నితిన్ గురించి మరో ట్వీట్లో స్పందిస్తూ.. నితిన్‌కు డబుల్ కంగ్రాట్స్. ఇప్పుడు పెళ్లి పనులు, వేడుకలు డబుల్ జోష్‌తో నీవు ముందుకు తీసుకు వెళ్తావని అనుకుంటున్నాను. మంచి టైంలో ఈ సక్సెస్ దక్కింది. నీ సక్సెస్ సంతోషాన్ని కలిగించింది. చిత్ర యూనిట్ సభ్యులందరికి కూడా కంగ్రాట్స్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.
బన్నీ ట్వీట్‌తో భీష్మ యూనిట్ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. బన్నీ కంగ్రాట్స్‌తో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. సినిమాకు మంచి పబ్లిసిటీగా కూడా మారింది అంటూ యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ఇప్పటికే పలు ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్లుగా సమాచారం అందుతోంది. నితిన్ కెరీర్లో బిగ్గెస్ట్ చిత్రాల జాబితాలో ఇది నిలవడం ఖాయం అంటున్నారు.
490516 397382hello!,I really like your writing very so much! 919030
978235 394394Howdy! Do you know if they make any plugins to safeguard against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any recommendations? 582209
503333 358659I enjoy this site, will undoubtedly arrive back. Make sure you carry on writing high quality posts. 287190