Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల.. వైకుంఠపురములో హ్యాట్రిక్ విజయాల తర్వాత రాబోయే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పుడీ సినిమాపై నిర్మాత నాగవంశీ ఇచ్చిన క్లారిటీ మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది.
‘సోషియో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కతుందని వచ్చిన వార్తలు అవాస్తవం. ఈ సినిమా పూర్తిగా మైథలాజికల్ జానర్. పురాణాల ఆధారంగానే సినిమా తెరకెక్కబోతోంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభం కావచ్చ’ని అన్నారు. మరోవైపు.. కుమారస్వామిగా అల్లు అర్జున్ జిబ్లీ ఇమేజెస్ సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కనుంది. అల్లు అరవింద్ కూడా సినిమా నిర్మాణంలో భాగంకానున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాగవంశీ నిర్మించి మ్యాడ్ స్క్వేర్ మూవీ మంచి వసూళ్లతో ధియేటర్లలో సందడి చేస్తోంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన సినిమా యూత్ ని ఆకట్టుకుంది.
