‘అల వైకుంఠపురములో’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం క్వారంటైన్ కారణంగా ఇంట్లోనే ఉంటూ ఫామిలీతో సమయం గడుపుతూనే సుకుమార్ తో చేయనున్న తదుపరి సినిమాకి కూడా కసరత్తులు చేస్తున్నాడు. ఒక వైపు తన మాస్ లుక్ మరియు మరోవైపు చిత్తూరు స్లాంగ్ మీద కూడా పట్టు సంపాదించే పనిలో ఉన్నాడు.
ఇలా నటుడిగా తన కర్తవ్యం నెరవేరుస్తూనే… పర్సనల్ లైఫ్ లో కొన్ని బిజినెస్ లు కూడా సెట్ చేసేలా వ్యూహ రచన చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో ఓ కార్ లీజ్ బిజినెస్ చేయడం కోసం ఓ ఆటో మొబైల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇప్పుడు మరో బిజినెస్ కి శ్రీకారం చుట్టనున్నారు. కానీ ఈ సారి తనకి సంబంధం లేనిది కాకుండా తన సినీ ఫీల్డ్ లోనే సూపర్బ్ గ్రోత్ ఉన్న మ్యూజిక్ లేబుల్ ని స్టార్ట్ చేయాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
ఇప్పటికే పలు మ్యూజిక్ లేబుల్ సంస్థలు మార్కెట్ లో మంచి బిజినెస్ చేస్తున్నాయి. ఒక పాట హిట్ అయితే దాని వలన ఆ కంపెనీకి మంచి లాభాలే వస్తున్నాయి. అలాగే అల్లు అర్జున్ మ్యూజిక్ ఆల్బమ్స్ అన్ని బ్లాక్ బస్టర్ అవుతాయి. అందుకే త్వరలోనే అల్లు అర్జున్ ఓ మ్యూజిక్ లేబుల్ ని ప్రారంభించనున్నారు. అందులో తన సినిమాలతో పాటు యంగ్ టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మ్యూజిక్ లేబుల్ రంగంలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న కంపెనీలు కొన్నే ఉన్నాయి, మరి అల్లు అర్జున్ ఈ మ్యూజిక్ లేబుల్ రంగంలో సక్సెస్ అవుతాడో లేదో చూడాలి..
101279 362704I came to the exact conclusion as well some time ago. Wonderful write-up and I is going to be sure to look back later for more news. 673235
107159 38381I like this site so much, saved to favorites . 787723