ఇండస్ట్రీలో నందమూరి జూనియర్ ఎన్టీఆర్, బన్నీ ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉంటారు. పైగా ఒకరిని ఒకరు బావ, బావ అంటూ పిలుచుకుంటారు. ప్రతి ఫంక్షన్ లో కూడా కలుసుకుంటూ ఒకరిని ఒకరు అభినందించుకుంటారు. ఇలాంటి వీరిద్దరూ సినిమాల పరంగా కూడా చాలా సానుకూలంగానే ఉంటారు. అయితే ఓ సారి ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన కథతో బన్నీ సినిమా చేసి దిమ్మతిరిగే రిజల్ట్ ను అందుకున్నాడు. వీరిద్దరికీ వక్కంతం వంశీ కామన్ ఫ్రెండ్. పైగా వీరిద్దరికీ ఎన్నో హిట్ సినిమాలకు కథలను అందించాడు వంశీ.
టెంపర్ సినిమా కథను రాసింది కూడా వంశీనే. ఆ సినిమా టైమ్ లోనే మంచి సినిమా చేద్దాం కథ రాసుకో అంటూ వంశీకి హామీ ఇచ్చాడు ఎన్టీఆర్. దాంతో వంశీ ఓ కథను రాసుకున్నాడు. దాన్ని ఎన్టీఆర్ కు వినిపిస్తే పెద్దగా స్పందించలేదు. చూద్దాంలే అని అన్నాడు. అయితే ఇదే విషయాన్ని అల్లు అర్జున్ కు చెప్పాడు వంశీ. దాంతో ఆ కథను నాకు చెప్పమని బన్నీ అడగడంతో వంశీ చెప్పాడు. వెంటనే ఎన్టీఆర్ కు ఫోన్ చేసి కథ బాగుంది మంచి హిట్ అవుతుంది సినిమా చెయ్ అంటూ సలహా ఇచ్చాడు. కానీ ఎన్టీఆర్ పెద్దగా రియాక్ట్ కాలేదు. వంశీ మరోసారి ఎన్టీఆర్ ను రిక్వెస్ట్ చేస్తే సినిమా చేయను అంటూ నేరుగా చెప్పేశాడంట.
ఇదే విషయాన్ని బన్నీకి చెప్పగా.. నేను చేస్తా అంటూ వంశీతో మూవీ చేశాడు. అదే నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. ఈ మూవీ అప్పట్లో విడుదలై డిజాస్టర్ గా మిగిలింది. ఎన్టీఆర్ వద్దన్న కథతో రిస్క్ చేసిన బన్నీ.. చివరకు పెద్ద డిజాస్టర్ ను మూటగట్టుకున్నాడు. అప్పటి నుంచి వంశీకి మరో ఛాన్స్ ఇవ్వలేదు బన్నీ