Allu Arjun: వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్ గా నటించిన పావలా శ్యామల కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. చిరంజీవితోసహా ఆమెకు ఆర్ధికసాయం చేసిన వారెందరో ఉన్నారు. అయినా.. ఆమె వృధ్యాప్య సమస్యలకు తోడు ఆర్ధిక సమస్యలతో ఆమె బాధపడుతునే ఉన్నారు. ఈక్రమంలో ఆమెకు ఆర్ధికంగా సాయం అందించేందుకు హీరో అల్లు అర్జున్ ముందుకొచ్చారు.
ప్రస్తుతం పావలా శ్యామల ఆమె కుమార్తెతో సికింద్రాబాద్ లోని ఖార్ఖానా ఆర్కే ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. నెల నెలా ఆరోగ్య ఖర్చుల అవసరార్ధం ఆమెకు రూ.10వేలు అందించేందుకు నిర్ణయించారు. ఈమేరకు తన ప్రతినిధితో ఆమెకు సాయంగా 10వేలు పంపించారు. ఇకపై నెల నెలా ఈ మొత్తం పంపిస్తామని చెప్పారు. ఈ మొత్తం ఆమెకు మందులు, కొంత నిత్యావసరాలు కొనుగోలు చేసేందుకు ఉపయోగపడనున్నాయి.
ఏకమొత్తంగా కాకుండా నెల నెలా సాయం అందించడం ఆమెకు ఆర్ధిక భరోసా లభించడం సంతోషించే విషయం. దీంతో ఆమెకు అండగా నిలిచినందుకు అల్లు అర్జున్ కు ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
