అల్లు అర్జున్ అభిమానులే పవన్ కళ్యాణ్‌ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,376FansLike
57,764FollowersFollow

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నవారిలో ఎక్కువగా అల్లు అర్జున్ అభిమానులే కనిపిస్తున్నారు. సినిమా కోణంలో ట్రోల్స్ అంటే, వివిధ హీరోలకు చెందిన అభిమానులు చేయడం.. కొత్తేమీ కాదు.

పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనూ కొందరు, ఇతర హీరోలను ట్రోల్ చేసిన దాఖలాలూ లేకపోలేదు. సినిమా అన్నాక ఇలాంటివి మామూలే. ఓ దశ వరకూ ట్రోలింగ్ మరీ నేరమేమీ కాదు. కాకపోతే, హద్దులు దాటే ట్రోలింగ్ మాత్రం క్షమార్హం కాదు. అల్లు అర్జున్ అభిమానుల పేరుతో కొందరు, అన్ని హద్దులూ దాటేస్తున్నారు.

తాజాగా, పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినెవా మీదా, పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ మీదా అత్యంత అసభ్యకరమైన వ్యాఖ్యలతో ట్రోలింగ్ చేశారు కొందరు అల్లు అర్జున్ అభిమానులు. వాళ్ళలో కొందరిపై కేసులు నమోదయ్యాయి, అందులో కొందరి అరెస్టు కూడా జరిగింది.

ఆరా తీస్తే, వాళ్ళలో కొందరు వైసీపీ సపోర్టర్స్‌గా తేలింది. వైసీపీ కార్యకర్తలే, అల్లు అర్జున్ ముసుగేసుకుని, గత ఎన్నికల సమయంలో, పవన్ కళ్యాణ్‌ని అత్యంత నీఛంగా ట్రోల్స్ చేశారు. పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం అయ్యాక, వాళ్ళు మరింతగా చెలరేగిపోయారు.

నిజానికి, అలాంటివారిని ‘దూరం’గా పెట్టే అవకాశం అల్లు అర్జున్‌కి లేకపోలేదు. కానీ, అల్లు అర్జున్ ఎందుకో, అభిమానుల్ని ఎంకరేజ్ చేస్తున్నట్లే వుంది ఇలాంటి విషయాల్లో. వైసీపీకి చెందిన ఓ నాయకుడితో అల్లు అర్జున్‌కి సన్నిహిత సంబంధాలు వుండడమే కారణమా.? అన్న అనుమామాలూ లేకపోలేదు.

‘నా ఆర్మీ మీరు’ అంటూ అభిమానుల్ని, వారు చేసే వెకిలి చేష్టల్నీ అల్లు అర్జున్ ఎండార్స్ చేస్తున్నట్లుగా వుండడంతో, విషయం మరింత ముదిరి పాకాన పడుతోంది. అదే సమయంలో, అల్లు అర్జున్ అభిమానుల ముసుగులో ఏం చేసినా చెల్లిపోతుందని వైసీపీ క్యాడర్ కూడా మరింత దిగజారిపోతున్నారు.

ఈ విషయంలో అల్లు అర్జున్ ఇప్పటికైనా, ఓ నిర్ణయం తీసుకుని, తన ‘ఆర్మీ’ని అదుపులో పెట్టుకుంటే మంచిది.

సినిమా

సీఎం రేవంత్ రెడ్డి సర్ప్రైజ్ విజిట్… విజయ్–రష్మిక దంపతులకు ప్రత్యేక శుభాకాంక్షలు

హైదరాబాద్‌లో సినీ నటుడు విజయ్ దేవరకొండ నివాసంలో ఈరోజు ప్రత్యేక సందడి కనిపించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి స్వయంగా అక్కడికి వెళ్లి ఇటీవల...

Vijay-Trisha: త్రిషతో కలిసి పెళ్లికి వెళ్లిన విజయ్..! దేనికి సంకేతం

Vijay-Trisha: చెన్నైలోని తిరువాన్మియూర్ లో ఓ వివాహ రిసెప్షన్ కు తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్, నటి త్రిష కలిసి హాజరయ్యారు....

Naga Chaitanya: నాగచైతన్యకు తృటిలో తప్పిన ప్రమాదం..

Naga Chaitanya: ఈరోజుల్లో సినిమాలకే కాదు, ఏ ప్రోగ్రామ్ జరిగినా ఈవెంట్ ఆర్గనైజర్లే నిర్వహిస్తున్నారు. చిన్న ప్రోగ్రామ్ అయితే హాల్ సిబ్బందే ఏర్పాట్లు చేస్తారు. అయితే.....

మిస్ ఇండియా నుంచి టాలీవుడ్ వరకూ.. మీనాక్షి చౌదరి ప్రయాణం

ఈరోజు అందం, ప్రతిభ కలగలిసిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పుట్టిన రోజు. మిస్ ఇండియా వేదిక నుంచి సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తక్కువ సమయంలోనే తెలుగు...

ముందుగానే రానున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తుఫాన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీ ముందుకు వచ్చింది. ముందుగా...

రాజకీయం

తిరుమల లడ్డూ వివాదం: ట్వీట్ ద్వారా స్పందించిన అచ్చెన్నాయుడు

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం నేపథ్యంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన ఈ అంశంపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ట్వీట్ ద్వారా స్పందించారు. ఏడుకొండల వాడి సాక్షిగా చెబుతున్నానని, వేంకటేశ్వర స్వామిపై తనకు ఉన్న...

జనాభా తగ్గుదలపై అప్రమత్తమైన ఏపీ… ‘పాపులేషన్ కేర్’ కొత్త విధానం

ఆంధ్రప్రదేశ్‌లో జనాభా నిర్మాణంలో వేగంగా జరుగుతున్న మార్పులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర జనాభా నిర్వహణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు జనాభా నియంత్రణపై దృష్టి పెట్టిన విధానాల నుంచి...

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు నిర్వహిస్తాం: పవన్ కళ్యాణ్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను కొత్తగా విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ దిశగా ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు...

కల్తీ నెయ్యి డబ్బులపై ధూళిపాళ్ల సంచలన ఆరోపణలు

టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ల తాజాగా కల్తీ నెయ్యి వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. కల్తీ నెయ్యి అక్రమ సొమ్ము కోట్ల రూపాయలుగా విజయవాడ, చెన్నైలకు చేరిందని ఆయన పేర్కొన్నారు....

నారా లోకేష్ ఆత్మీయ విందు.. ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధులతో ఉల్లాస సమ్మేళనం

ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అరకు పార్లమెంట్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, వారి కుటుంబసభ్యులతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ఆత్మీయ విందు సమావేశం ఆనందభరిత వాతావరణంలో జరిగింది. ఉండవల్లిలోని...

ఎక్కువ చదివినవి

జగన్‌కు హిందుత్వంపై విశ్వాసం లేదు: సాధు పరిషత్ అధ్యక్షుడి విమర్శలు

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి Y. S. Jagan Mohan Reddyకు హిందు ధర్మంపై విశ్వాసం లేదని రాష్ట్ర సాధు పరిషత్ అధ్యక్షుడు స్వామి శ్రీనివాస నంద సరస్వతి ఆరోపించారు. శుక్రవారం నిర్వహించిన...

వేట్లపాలెం పేలుడు ఘటనపై రాజమండ్రిలో సీఎం–డిప్యూటీ సీఎం భేటీ,

రాజమండ్రి: వేట్లపాలెంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా కాకినాడ...

ఏపీ విద్యకు కొత్త దిశ: ప్రపంచానికి ఆంధ్ర మోడల్ చూపుదాం – లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా రంగాన్ని బలోపేతం చేసి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా “ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్”ను నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్...

సీఏం , డిప్యూటీ సీఏంల కీలక భేటీ

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ మరియు అటవీ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ...

చంద్ర గ్రహణం 2026: మీ రాశిపై ప్రభావం ఎంత? ఏ రంగు బట్టలు మంచివి?

మార్చి 3, 2026 సాయంత్రం జరగబోయే చంద్ర గ్రహణం అనేక రాశులపై ప్రభావం చూపే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చంద్ర గ్రహణం సాధారణంగా మన భావోద్వేగాలు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ...