పుష్ప 2 తో పాన్ ఇండియా సెన్సేషనల్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా పనులు మొదలు పెట్టాడని తెలుస్తుంది. త్రివిక్రంతో చేయాల్సిన భారీ మూవీకి కొద్దిగా గ్యాప్ ఇచ్చి కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా లాక్ చేసుకున్నాడు పుష్ప రాజ్. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని టాక్.
ఇక కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం ప్రకారం అట్లీ, అల్లు అర్జున్ కాంబో సినిమాను సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించబోతుందట. అంతేకాదు ఈ సినిమాలో అల్లు అర్జున్ డ్యుయల్ రోల్ లో నటిస్తాడని చెబుతున్నారు. అట్లీ చెప్పిన స్క్రిప్ట్ అల్లు అర్జున్ ని ఇంప్రెస్ చేసిందని.. సినిమాలో బన్నీ ద్విపాత్రాభినయంతో అలరిస్తాడని అంటున్నారు.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ తో జవాన్ సినిమా చేసిన అట్లీ సల్మాన్ తో సినిమా ప్లాన్ చేసినా ఎందుకో ముందుకు సాగలేదు. అందుకే అల్లు అర్జున్ తో సినిమాను ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. అల్లు అర్జున్ 22వ సినిమాగా రాబోతున్న ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుంది. సినిమా లో మిగతా కాస్ట్ ఎవరన్నది తెలియాలంటే మరికొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.
ఈ సినిమా పూర్తి చేశాక కానీ అల్లు అర్జున్ త్రివిక్రం సినిమా లైన్ లోకి వస్తుందని తెలుస్తుంది. ఐతే ఈ సినిమా పూర్తయ్యే దాకా త్రివిక్రం వెయిట్ చేస్తాడా మరో కథతో మరో హీరోతో సినిమా చేస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.