Allu Arjun: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా ప్రస్తుతం ధియేటర్లలో సందడి చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులు సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. తొలిరోజు కలెక్షన్లు 294కోట్లు వసూలు చేసినట్టు చిత్ర వర్గాలు తెలిపాయి. ఈక్రమంలో సినిమా టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడారు.
‘పవన్ బాబాయ్ కి థ్యాంక్స్..’ అన్న మాటలు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో ఉన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ అల్లు అర్జుస్ మాట్లాడిన మాట్లాడటంపై జనసేన వర్గాలు.. పవన్ కల్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఉన్న అసహనంలో ఉన్న అభిమానులను ఉత్సాహపరిచారు.
సినిమాకు ఏపీలో ప్రత్యేక రేట్స్ కు అనుమతి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈక్రమంలో నా మనసులో మాట.. ‘పవన్ బాబాయ్’కి థ్యాంక్స్ అనటం హైలైట్ గా నిలిచింది.