అల్లు అర్జున్ ఇప్పటి వరకు మనకు ఐకాన్ స్టార్ గా తెలుసు. అంతకు ముందు అతను స్టైలిష్ స్టార్ గా ఉండేవాడు. కానీ పుష్ప సినిమాతో అతను స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా ఎదిగి చూపించాడు. అయితే ఇప్పుడు పుష్ప-2 సినిమా చూసిన వారంతా కూడా అల్లు అర్జున్ సూపర్ స్టార్ స్టేటస్ ను కూడా సంపాదించుకున్నాడని కామెంట్లు చేస్తున్నారు. సూపర్ స్టార్ అంటే తెలుగులో మొదట్లో కృష్ణకు ఆ తర్వాత ఆయన కొడుకు మహేశ్ బాబుకు మాత్రమే ఉండేది. అయితే ఇదే సూపర్ స్టార్ స్టేటస్ మీద మహేశ్ బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
నా దృష్టిలో సూపర్ స్టార్ అంటే ఎంత మంది అతని సినిమాను విమర్శించినా సరే జనాలను థియేటర్లలోకి రప్పించే శక్తి ఉన్నవాడు. తన యావరేజ్ సినిమాలకు కూడా జనాలను రప్పించే స్థాయి ఉన్న వాడు. నా దృష్టిలో రజినీకాంత్ నిజమైన సూపర్ స్టార్. ఎందుకంటే ఆయన యావరేజ్ సినిమాలకు కూడా జనాలు ఎగబడుతుంటారు. ఆయన సినిమాల మీద ఎన్ని వివాదాలు సృష్టించినా జనాలు మాత్రం థియేటర్లకు వెళ్తుంటారు అని చెప్పుకొచ్చాడు మహేశ్. కాగా ఇప్పుడు బన్నీ కూడా అదే బాటలో పయనిస్తున్నాడంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఎందుకంటే పుష్ప-2 సినిమాపై కూడా ఎన్నో విమర్శలు, వివాదాలు చుట్టుముట్టాయి. కొన్ని సార్లు ఆ సినిమాను బాయ్ కాట్ చేయాలనే ప్రచారం కూడా జరిగింది. అయినా సరే అన్ని అడ్డంకులను దాటుకుని ఈ రోజు సినిమా బిగ్గెస్ట్ హిట్ కొట్టింది. జనాలు థియేటర్లకు వరదలా వచ్చేస్తున్నారు. కాబట్టి అల్లు అర్జున్ కూడా మహేశ్ మాట ప్రకారం రియల్ సూపర్ స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నట్టే అంటూ కామెంట్లు పెడుతున్నారు.