తండేల్ ఈవెంట్ లో రామ్ చరణ్ గురించి తగ్గించి మాట్లాడాడని మెగా ఫ్యాన్స్ అంతా కూడా సోషల్ మీడియాలో అల్లు అరవింద్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ఆయన ఎలా ఎప్పుడు స్పందిస్తారా అని ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా తండేల్ పైరసీ గురించి చెప్పేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న అల్లు అరవింద్ ఈ విషయంపై స్పందించారు.
మొన్న దిల్ రాజుని ఆహ్వానిస్తూ రామ్ చరణ్ ని తగ్గించానని ఒక రిపోర్టర్ అడిగాడు. కానీ అప్పుడు కాదు మళ్లీ తర్వాత మాట్లాడతా అని చెప్పా. ఐతే దిల్ రాజు ఒక వారం వ్యవధిలోనే కష్ట నష్టాలు పడ్డాడు ఇన్కం టాక్స్ వాళ్లు కూడా వచ్చారన్న విషయాన్ని చెబుతూ యదాలాపంగా తాను అలా మాట్లాడాను తప్ప చరణ్ ని ఉద్దేశించి కాదని అన్నారు అల్లు అరవింద్.
తన కామెంట్స్ వల్ల హర్ట్ అయిన మెగా అభిమానులను ఉద్దేశించి చరణ్ నా కొడుకు లాంటి వాడు. చరణ్ తనకు ఒక్కగానొక్క మేనల్లుడు అతనికి తాను ఒక్కడినే మేనమామ. చరణ్ తో తనకు ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది మమ్మల్ని వదిలేయండి అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఇదే ప్రెస్ మీట్ లో తండేల్ సినిమా పైరసీ చేసిన వారిని అసలు వదిలి పెట్టేది లేదని వాళ్లని జైలుకి పంపిస్తామని అన్నారు అల్లు అరవింద్.