Switch to English

అల్లరి నరేష్ ‘నాంది’ మూవీ రివ్యూ: రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా.!

Critic Rating
( 2.75 )
User Rating
( 3.80 )

No votes so far! Be the first to rate this post.

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,515FansLike
57,764FollowersFollow
Movie నాంది
Star Cast అల్లరి నరేష్, వరలక్ష్మీ శరత్ కుమార్, నవమి గాయక్
Director విజయ్ కనకమేడల
Producer సతీష్ వేగేశ్న
Music శ్రీచరణ్ పాకాల
Run Time 2 గంటల 26 నిమిషాలు
Release ఫిబ్రవరి 19, 2021

వరుసగా కామెడీ సినిమాలు చేస్తూ సరైన విజయాన్ని అందుకోలేకపోయిన అల్లరి నరేష్ తన పంథాని కాస్త మార్చి కంప్లీట్ రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామాగా చేసిన సినిమా ‘నాంది’. కామెడీ మీద కాకుండా తనలోని నటుడిని మరోసారి తెరకి పరిచయం చేస్తూ, విజయ్ కనకమేడల దర్శకత్వంలో చేసిన ఈ సినిమా అల్లరి నరేష్ అభిమానులతో పాటు, తెలుగు ప్రేక్షకులకు ఏ మేర నచ్చిందో ఇప్పుడు చూద్దాం..

కథ:

బండి సూర్య ప్రకాష్ (అల్లరి నరేష్) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. తనదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ నాన్నతో హ్యాపీగా ఉన్న తను నవమి గాయక్ తో ప్రేమలో పడతాడు. ఆ తరువాత సూర్య – నవమిలకి నిశ్చితార్ధం కూడా అవుతుంది. ఆల్ హ్యపీస్ అనుకున్న టైమ్ లో పౌర హక్కుల సంఘం అధినేత రాజగోపాల్ హత్యకి గురవుతాడు. ఆ కేసు డీల్ చేస్తున్న సిఐ కిషోర్(హరీష్ ఉత్తమన్) రాజగోపాల్ ని మర్డర్ చేసింది సూర్య ప్రకాష్ అని అరెస్ట్ చేస్తారు. సూర్య ప్రకాష్ నేరం ఒప్పుకోకపోయినా పలు సాక్ష్యాలు సృష్టించి జైల్లో ఉండేలా చూస్తాడు. అలా ఐదేళ్లు జైల్లో రిమాండ్ లో ఉండిపోయిన సూర్య ప్రకాష్ బయటకి రావడానికి ఆధ్య(వరలక్ష్మీ శరత్ కుమార్) ఏం చేసింది?సూర్య ప్రకాష్ నిర్దోషిగా బయటకి వచ్చాడా? లేదా? బయటకి వస్తే అన్నీ కోల్పోయిన సూర్య ప్రకాష్ ఏం చేశాడు? తనని కేసులో ఇరికించన వారందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెట్టరా? లేదా అన్నదే కథ.

తెరపై స్టార్స్..

ఆన్ స్క్రీన్ పరంగా ఇద్దరే ఈ సినిమాకి హీరోలు.. అల్లరి నరేష్ అండ్ వరలక్ష్మీ శరత్ కుమార్.. ముందుగా అల్లరి నరేష్ కెరీర్లోనే ది బెస్ట్ పర్ఫార్మన్స్ ఇచ్చాడు. ఒక మిడిల్ క్లాస్ కుర్రాడిగా మన అందరికీ నచ్చుతాడు, అలాగే తన లైఫ్ లో జరిగే సంఘటనతో ప్రేక్షకులను ఏడిపిస్తాడు. ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని వన్ మ్యాన్ షో లా అదరగొట్టడాని చెప్పాలి. ఈ సినిమాలో చాలా చోట్ల కళ్ళలో నీళ్ళు తిరిగేలా నటించాడు. ఓవరాల్ గా అల్లరి నరేష్ ది మాస్టర్ పీస్ పర్ఫార్మన్స్ అని చెప్పచ్చు. ఇక సెకండ్ పిల్లర్ వరలక్ష్మీ శరత్ కుమార్ లాయర్ గా సెకండాఫ్ ని చాలా బాగా నడిపించింది. కోర్ట్ సీన్స్ లో లాయర్ గా కాన్ఫిడెన్స్ లెవల్స్ ని బాగా చూపించింది. ఓన్ డబ్బింగ్ లో అక్కడక్కడా స్పష్టత లోపించినా తన డెడికేషన్ కి మెచ్చుకొనే తీరాలి. అల్లరి నరేష్ ఫాదర్ గా చేసిన దేవీ ప్రసాద్, ఫ్రెండ్ పాత్రలో ప్రవీణ్ లు కూడా ఎమోషనల్ గా మెప్పించారు. ఓపెనింగ్ సీన్ లో ప్రియదర్శి కాసిన్ని నవ్వులు తెప్పిస్తాడు. విలన్ పాత్రలో హరీష్ ఉత్తమన్ చాలా బాగా చేశాడు. ఓవరాల్ గా ఆన్ స్క్రీన్ కనిపించిన నటీనటుల నటన సినిమాకి హైలైట్.

తెరవెనుక స్టార్స్..

టెక్నికల్ గా కొన్ని క్రాఫ్ట్స్ లో బ్రిలియంట్ వర్క్ కనపడింది. ముందుగా దర్శకుడు అనుకున్న దాన్ని అద్భుతంగా విజువల్స్ గా మార్చడంలో సిడ్ సూపర్ సక్సెస్ అయ్యాడు. రియలిస్టిక్ సినిమాలో విజువల్స్ కూడా అంతే రియల్ గా ఉండేలా చూసుకున్నారు. ఆ విజువల్స్ కి అద్భుతమైన మ్యూజిక్ అందించాడు శ్రీ చరణ్ పాకాల. పాటలు సినిమాలో బాగా అనిపిస్తాయి, అంతకు మించి నేపధ్య సంగీతంతో సినిమాని చూసే ఆడియన్స్ హృదయాలకి మరింత దగ్గర చేశాడు. బ్రహ్మకడలి ఆర్ట్ వర్క్ కూడా మనం రోజూ చూసే వాటికి దగ్గరగా చాలా రియల్ గా ఉండేలా చూసుకున్నారు. ఇకపోతే చోట కే ప్రసాద్ ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ లో చాలా టైట్ గా, ఎంగేజ్ గా అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ పరంగా చూసుకుంటే కాస్త బోర్ అనిపించేస్తుంది. ఇంకాస్త ఇంటరెస్ట్ క్రియేట్ చేయాల్సింది అనే ఫీలింగ్ వస్తుంది. అబ్బూరి రవి డైలాగ్స్ ప్రతి ఒక్కరూ ఆలోచించేలా ఉన్నాయి.

ఇక ఈ సినిమాకి కెప్టెన్ అయిన నూతన దర్శకుడు విజయ్ కనకమేడల విషయానికి వస్తే.. అనుకున్న కథని బాగానే చెప్పాడని చెప్పాలి. ఈ కథకి ఫస్ట్ హాఫ్ కంటే మించి సెకండాఫ్ మరింత కీలకం. ఫస్ట్ హాఫ్ ని చాలా సిన్సియర్ గా ఎక్కడా పక్కకి వెళ్ళకుండా పర్ఫెక్ట్ గా చెప్పాడు, అలాగే హీరో పెయిన్ ని అందరికీ రీచ్ చేశాడు. ఎంతలా రీచ్ చేశాడు అంటే అల్లరి నరేష్ ఒక ఇంటెన్స్ ఫైట్ చేస్తున్నా మనకు అల్లరి నరేష్ ఇమేజ్ కనపడనంతగా, సూర్య ప్రకాష్ పెయిన్ కనపడేలా చేశాడు. కానీ సెకండాఫ్ లో ఎప్పుడైతే కొత్తదైన సెక్షన్ 211 గురించి చెప్పాలనుకున్నాడో ఆ పాయింట్ బాగుంది కానీ అనుకున్నది అంత ఎఫెక్టివ్ గా చెప్పలేదు అనిపిస్తుంది. సెకండాఫ్ లో ఎక్కడో ఆ రియలిస్టిక్ ఫీలింగ్ తగ్గి హీరోయిక్ యాంగిల్ లోకి కథ షిఫ్ట్ అవ్వడం, విలన్ కి సరైన కౌంటర్ లేకుండా వీక్ చేసెయ్యడం సినిమాకి మైనస్. కొన్ని కొన్ని సీన్స్ బాగున్నా ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ లో కనిపించిన హానెస్ట్ సెకండాఫ్ లో కనిపించలేదు. కోర్ట్ డ్రామాలో పోటా పోటీ వాదన ఉంటేనే మజా అనే లాజిక్ ని మిస్ అయ్యాడు అనిపిస్తుంది. విజయ్ లో కంటెంట్ ఉందని ప్రూవ్ చేసుకున్నాడు కానీ సెకండాఫ్ విషయంలో మరింత కేర్ తీసుకోవాల్సింది. సతీష్ వేగేశ్న నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

విజిల్ మోమెంట్స్:

– అల్లరి నరేష్ మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మన్స్
– అదిరింది అనిపించే ఎమోషనల్ ఫస్ట్ హాఫ్
– కళ్ళు చెమ్మగిల్లేలా చేసే ఎమోషనల్ సీన్స్
– సెకండాఫ్ లో వచ్చే కోర్ట్ సీన్స్
– విజువల్స్ అండ్ నేపధ్య సంగీతం

బోరింగ్ మోమెంట్స్:

– సెకండాఫ్ అంట ఎంగేజింగ్ గా అనిపించకపోవడం
– రియలిస్టిక్ నుంచి హీరోయిక్ జోన్ లోకి వెళ్లడం
– చుట్టేసినట్టు అనిపించే క్లైమాక్స్
– విలన్ కౌంటర్స్ స్ట్రాంగ్ గా ఉండాల్సింది

విశ్లేషణ:

అల్లరి నరేష్ తన ఇమేజ్ ని పూర్తిగా పక్కన పెట్టి చేసిన ‘నాంది’ సినిమా కచ్చితంగా చూసిన ఆడియన్స్ కి ఎమోషనల్ గా ఓ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడమే కాకుండా, అబ్బా అల్లరి నరేష్ ఏమైనా పెర్ఫార్మన్స్ చేశాడా.. అదరగొట్టాడు అని మాత్రం కచ్చితంగా అనుకుంటారు. కానీ ఓవరాల్ గా సినిమా చూసుకున్నప్పుడు ఫస్ట్ హాఫ్ ఎమోషనల్ గా టచ్ చేసి భలే ఉంది అనే ఫీలింగ్ కలిగించి సెకండాఫ్ లో ఆ ఫీలింగ్ ని డ్రాప్ చేసెయ్యడం కాస్త నిరాశ పరిచే విషయం. ఓవరాల్ రియాలిస్టిక్ ఎమోషనల్ డ్రామా ఇష్టపడే వారందరికీ నచ్చే సినిమా ‘నాంది’.

చూడలా? వద్దా?: రెగ్యులర్ మూస ధోరణి సినిమాల నుంచీ కొత్త ఫీల్ కావాలంటే తప్పకుండా చూడచ్చు.

తెలుగుబులెటిన్.కామ్ రేటింగ్: 2.75/5

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా ఆయనకు పరిశ్రమ, కుటుంబం, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తన పుట్టినరోజు...

Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ సందడి షురూ

Vijay Devarakonda : విజయ్‌ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా పరశురామ్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ స్టార్‌ సినిమా విడుదలకు...

Chiranjeevi: బెంగళూరు నీటి సమస్యపై చిరంజీవి స్పందన.. ఫొటోలు వైరల్

Chiranjeevi: 40ఏళ్లలో బెంగళూరువాసులు ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. సర్వత్రా ఆందోళన కలిగిస్తోన్న సమస్యకు ప్రాంతాలతో సంబంధంలేదని.. నీటి వాడకం, పొదుపుపై తగిన జాగ్రత్తలు...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.....

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి...

Ranbir Kapoor : ‘రామాయణం’ కోసం యానిమల్‌ ఏం చేస్తున్నాడంటే…!

Ranbir Kapoor బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు అన్ని ఇండియన్‌ భాషల సినీ ప్రేక్షకులు నితీష్‌ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా...

రాజకీయం

Nara Lokesh: ‘సీఎం ఇంటికెళ్లిన కంటెయినర్ కథేంటి..’ లోకేశ్ ప్రశ్నలు

Nara Lokesh: సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లిన కంటెయనర్ అంశం ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టిస్తోంది. ఇది ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ (Nara...

రాముడి విగ్రహం తల నరికినోళ్ళకి.. అర్చకులు ఓ లెక్కా.?

అంతర్వేది రథం తగలబడితే.. దోషులెవరో దొరకలేదు. వైసీపీ పాలనలో వ్యవస్థలు ఎలా తగలడ్డాయో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది.? తేనెపట్టుని తీసే ప్రయత్నంలో ఆకతాయిలెవరో మంట పెడితే, అంతర్వేది రథం తగలబెట్టారంటూ వైసీపీ...

Raghu Rama Krishna Raju: రాజుగారి రివర్స్ గేర్.! ఎవరికి నష్టం.?

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు రివర్స్ గేర్ వేసేశారు. బీజేపీ నుంచి టిక్కెట్ రాదని తేలిపోయాక, టీడీపీ మీద ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు రఘురామకృష్ణరాజు చిత్రంగా.! ‘టీడీపీ నాకు నర్సాపురం టిక్కెట్ ఇచ్చి తీరాలి..’...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

పవన్ కళ్యాణ్ మీద విషం కక్కుతున్న ముద్రగడ.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం విషం చిమ్ముతున్నారు. తన కుటుంబ సభ్యులపై చంద్రబాబు పోలీసుల ద్వారా దాడి చేయించారనీ, బూతులు తిట్టించారనీ ముద్రగడ పద్మనాభం ఆరోపిస్తున్నప్పుడు,...

ఎక్కువ చదివినవి

Janasena: జనసేనలో నిరసనలు.. తిరుగుబాట్లు..

Janasena: జనసేన (Janasena)లో అంతర్గపోరు తప్పేలాలేదా అంటే ప్రస్తుత పరిణామాలు ఇవే సూచిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆశిస్తున్న జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్, స్థానిక కార్యకర్తలు, ఆయన మద్దతుదారులు...

అందరినీ మెప్పించే చిత్రం ‘టిల్లు స్క్వేర్’: దర్శకుడు మల్లిక్ రామ్

తెలుగునాట యువతలో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సినిమాలలో 'డీజే టిల్లు' ఒకటి. టిల్లుగా స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ పంచిన వినోదాన్ని ప్రేక్షకులు అంత తేలికగా మరిచిపోలేరు. టిల్లు మాటలు, చేష్టలు ప్రేక్షకుల...

వైసీపీని గెలిపించడమే బీజేపీ లక్ష్యమా.?

టీడీపీ - జనసేన కూటమితో కలిసింది బీజేపీ.. అధికారికంగా.! కానీ, వైసీపీతో కలిసి పనిచేస్తున్నట్లుగా వుంది బీజేపీ వ్యవహారం.! ఇదీ, నిన్నటి బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్ట్ తర్వాత రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్న...

Ram Charan: ‘సుజిత్ పెళ్లికి ఎందుకు పిలవలేదు..’ ఆనంద్ మహీంద్రాకు రామ్ చరణ్ ప్రశ్న

Ram Charan: సుజిత్ పెళ్లికి నన్నెందుకు ఆహ్వానించలేదని రామ్ చరణ్ (Ram Charan) ప్రశ్నించడంతో పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) సమాధానమిచ్చారు. ఇంతకీ ఆ సుజిత్ ఎవరు.. ఫన్నీ సంభాషణ...

Ram Charan Birthday special: మెగా కోటపై సగర్వంగా ఎగురుతున్న జెండా.. రామ్ చరణ్

Ram Charan: కుటుంబం పేరు నిలబెట్టాలంటే వారి గౌరవం కాపాడటమే కాదు.. తనకు తాను ఎదగాలి.. ఉన్నత స్థానం పొందాలి.. పేరు గడించాలి. ఫలానా వారి అబ్బాయి అనేకంటే.. ఈ అబ్బాయి తండ్రి...