వైఎస్ఆర్సీపీ కి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత, ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని( కాళీ క్రిష్ణ శ్రీనివాస్) పార్టీకి రాజీనామా చేశారు. దీంతోపాటు ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. ఈ ఏడాది ఏపీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏలూరు నుంచి పోటీ చేసిన నాని.. సమీప కూటమి అభ్యర్థి రాధాకృష్ణయ్య చేతిలో ఓటమిపాలయ్యారు. అప్పటినుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ నిర్వహించిన సమావేశానికి ఆయన గైర్హాజరయ్యారు.
ఇటీవలే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సైతం వైసీపీని వీడిన విషయం తెలిసిందే. అంతకుముందు పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య కూడా వైసీపీ కి రాజీనామా చేశారు.