గత ఎన్నికల్లో ఏపీలో హడావిడి చేసిన ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ ఈసారి తెలంగాణలో హడావుడి చేస్తున్నారు. వచ్చే ఏడాది చివర్లో జరుగబోతున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ మెజార్టీ తో గెలుపొందుతాం అనే ధీమాతో ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయడం ద్వారా జనాల్లోకి వెళ్లబోతున్నట్లుగా ప్రకటించాడు. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన పాల్ మరోసారి టీఆర్‌ఎస్ పై విరుచుకు పడ్డాడు.
తెలంగాణలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. టీఆర్‌ఎస్ పార్టీ చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి తన వెనుక బీజేపీ ఉందంటూ విమర్శలు చేస్తున్నారు. దేశంలో ఉన్న పార్టీలన్నీ కూడా అవినీతిమయం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ అంటే భయం. దేశంలోని ఇతర అన్ని పార్టీలు కూడా బీజేపీకి అనుంబంధ పార్టీలుగానే పని చేస్తున్నాయి. సేవ చేసేందుకు తమకు ఒక్క ఛాన్స్ ఇస్తే తప్పకుండా రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తామని పాల్ పేర్కొన్నాడు.