గతేడాది బాలీవుడ్ నటులు రన్బీర్ కపూర్, అలియా భట్ లకు వివాహం జరిగిన విషయం తెల్సిందే. అది జరిగిన కొన్ని నెలలకే ఆమె గర్భవతి అని ప్రకటించారు. కట్ చేస్తే అలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాప పేరు రాహా కపూర్. ప్రస్తుతం తన సినిమాలపై ఫోకస్ చేస్తూనే అమ్మతనాన్ని ఆస్వాదిస్తోంది అలియా భట్.
ఇక బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అలియా భట్ రెండోసారి గర్భవతి అయినట్లు తెలుస్తోంది. ఇంతలోనే మరోసారి గర్భవతి నిజమేనా అంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు. అయితే ఇటీవలే అలియా ఓ దుస్తుల కంపెనీలో మెటర్నిటీ విభాగాన్ని లాంచ్ చేయడానికి ముఖ్యఅతిథిగా విచ్చేయగా ఆమెను చూసిన అందరూ అలియా భట్ గర్భవతి అంటున్నారు.
మరి ఈ విషయమ్మీద కపూర్ కుటుంబం ఏమైనా అధికారిక ప్రకటన చేస్తుందేమో చూడాలి.