‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అంటాడు సినీ కమెడియన్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అయిన అలీ. నూట డెబ్భయ్ ఐదుకి.. నూట డెబ్భయ్ ఐదు సీట్లూ గెలిచేస్తామని అలీ చెబుతున్నాడు. ఆయనకేం పోయింది.? ఆయన ఆంధ్రప్రదేశ్లో వుండడు.. ఎన్నికల ప్రచారంలో వైసీపీకి సాయం చేసినందుకు, ఓ పదవి వచ్చింది.. పండగ చేసుకుంటున్నాడంతే.
రాష్ట్రానికి ఓ రాజధాని అవసరం. ఆ రాజధానిని వైసీపీ చంపేసినాగానీ, ఆ రాష్ట్రంలో పుట్టి పెరిగిన అలీకి, రాజధాని వ్యవహారంతో సంబంధం లేదు. అలీ స్వస్థలమైన రాజమండ్రికి కూత వేటు దూరంలోనే పోలవరం ప్రాజెక్టు నిర్మితమవుతోంది. ఆ ప్రాజెక్టు పరిస్థితి అతీ గతీ లేకున్నా.. అలీకి అనవసరం. ఎందుకంటే, ఆయన సెటిలైంది హైద్రాబాద్లో.
కాబట్టి, అలీ ఆంధ్రప్రదేశ్ ఎలా తగలబడినాసరే.. ఆయనకేమీ ఫరక్ పడదు. పదవి ఇచ్చారు కాబట్టి, అధికార పార్టీ భజన చేయాల్సిందే. ఇక్కడ కేవలం అలీని మాత్రమే నిందిస్తే ఉపయోగమేముంది.? వైసీపీలో అందరిదీ ఇదే పరిస్థితి. అందరూ ఇదే పాట పాడాలి.. లేదంటే అంతే సంగతులు.!
సంక్షేమం.. సంక్షేమం.. సంక్షేమం.. దీన్నేదో ‘బిచ్చం’ అన్నట్లు చూస్తోంది అధికార వైసీపీ. ‘మేం బిచ్చమేశాం.. వాళ్ళు చచ్చినట్లు ఓట్లేస్తారు.. లేకపోతే, బిచ్చం వెయ్యం..’ అన్నట్లుగా అధికార పార్టీ నేతలు మాట్లాడటం చూశాం. స్థానిక ఎన్నికల సమయంలో, ‘మాకు ఓట్లెయ్యకపోతే మీకు సంక్షేమ ఫలాలు అందవ్..’ అని సాక్షాత్తూ మంత్రులే హెచ్చరించారు.
ఇప్పుడు అదే సంక్షేమం వల్లనే తాము మళ్ళీ గెలుస్తామని వైసీపీ అంటోంది. అంటే, రాష్ట్ర ప్రజల్ని కేవలం బిచ్చగాళ్ళగా మాత్రమే అధికార పార్టీ చూస్తోందన్నమాట. సంక్షేమం.. ప్రజల హక్కు. అభివృద్ధి చేయడం ద్వారా పెరిగే సంపద.. ఆ సంపద నుంచి సంక్షేమం అమలైతే.. అదీ అసలు సిసలు సంక్షేమం.
ప్రజలకు ఈ సంక్షేమం అనే బిచ్చం గురించి సరైన అవగాహన ఏర్పడిన రోజు, ‘ఇది మా హక్కు..’ అని నినదించగలిగిన రోజు.. వైసీపీ ఆటలకు చెల్లుచీటీ తప్పదు.!
3522 83383I believe one of your advertisings triggered my internet browser to resize, you could well want to put that on your blacklist. 661471
94974 939200Hey there, Can I copy this post image and implement it on my private internet log? 690918
767868 646635The great intreguing articles keep me coming back here time and time once again. thank you so much. 883746