బిగ్‌బాస్ రియాల్టీ షో మూడో సీజన్‌కి సంబంధించి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ లిస్ట్‌ని తీసుకుంటే ఖచ్చితంగా టాప్-5లో అలీ రెజా వుంటాడు. రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’ సినిమాలో హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో కన్పిస్తాడు అలీ రెజా. తెలుగు బుల్లితెరపై పలు సీరియల్స్‌లోనూ నటించాడు. అగ్రెసివ్‌గా వుంటాడన్న విషయాన్ని పక్కన పెడితే, బిగ్‌హౌస్‌లో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్ అలీ రెజా. టాస్క్‌లంటే చాలు.. విశ్వరూపం చూపించేస్తాడు. ఈ క్రమంలో అదుపు తప్పేస్తాడు కూడా. కోపాన్ని అస్సలేమాత్రం కంట్రోల్ చేసుకోలేడు. అదే ఇప్పుడు అతనికి శాపంగా మారిందా.? అంటే, అవుననే అంటోంది సోషల్ మీడియా.
ఈ వారం ఎలిమినేషన్‌కి సంబంధించి అలీ రెజా నామినేట్ అయ్యాడు. సోషల్ మీడియా ట్రెండ్స్‌ని బట్టి చూస్తే, అత్యల్పంగా ఓట్లు వచ్చింది అలీ రెజాకే. అలీ రెజాతో పోల్చితే రవి కృష్ణ కాస్త బెటర్‌గా ఓట్లు సాధించాడు. ఈ ట్రెండ్స్ ప్రకారం అలీ రెజా నామినేట్ అవడం ఖాయంగా కన్పిస్తోంది. మరోపక్క, అలీ రెజా ఎలిమినేట్ అయిపోయాడంటూ కొన్ని లీకులు బిగ్‌బాస్ వర్గాల నుంచే సోషల్ మీడియాకి అందుతున్నాయట. ‘సాయంత్రానికి అప్‌డేట్ అందిస్తాం..’ అంటూ కొందరు, బిగ్‌హౌస్‌కి సంబంధించిన సమాచారాన్ని ముందే లీక్ చేసేస్తున్నారు.
నిజానికి, ఎలిమినేట్ అయ్యేదెవరో ఆదివారం ఎపిసోడ్‌తో తెలుస్తుంది. ఈ రోజు ఇంకా శనివారమే. ఈ శనివారం ఎపిసోడ్ కూడా కొద్ది గంటల్లో ప్రసారమవుతుంది. మరి, అలీ వికెట్ పడిందని ఎలా లీక్ బయటకు వచ్చింది.? ఇప్పటిదాకా బిగ్ హౌస్‌కి సంబంధించి బయటకు వచ్చిన లీకులన్నీ నిజమయ్యాయి.
గత వారం హిమజ ఎలిమినేట్ అవ్వాల్సి వున్నా, చివరి నిమిషంలో రద్దు చేశారట. అలా రద్దు చేసిన విషయం కూడా శనివారం సాయంత్రమే లీక్ రూపంలో బయటకు రావడం గమనార్హం. అన్నట్టు, బిగ్‌బాస్ తాజా ప్రోమోలో హోస్ట్ నాగార్జున, హౌస్ మేట్స్‌కి క్లాస్ పీకుతూ కన్పించాడు. అలా క్లాస్ పీకించుకున్నవారిలో అలీ రెజాతోపాటు, పునర్నవి కూడా వుంది. పునర్నవికి చిన్న పంచ్ వేశాడు కింగ్ నాగ్. అలీ రెజాని మాత్రం గట్టిగానే ఏసుకున్నాడు నాగార్జున.
