Switch to English

కమెడియన్‌ అలీ.. ‘కల’ నిజమవుతోందట!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

మంత్రి పదవి సినీ నటుడు అలీ ‘డ్రీమ్‌’. అసెంబ్లీలో ‘అధ్యక్షా’ అంటూ ఎమ్మెల్యే హోదాలో నినదించాలని ఆశించిన అలీకి, తెలుగుదేశం పార్టీ ఒకటికి రెండుసార్లు దెబ్బ కొట్టింది. అయితే, టీడీపీ నుంచి అలాంటి షాక్‌లు అలీకి తగలడం వెనుక, ఆయనగారి ‘అత్యుత్సాహం’ కూడా అసలు కారణమేంటారు కొందరు. టీడీపీ నుంచి టిక్కెట్‌ ఆశించి, వేరే పార్టీలవైపు అలీ తన చూపు మరల్చడంతో సహజంగానే ఎవర్నీ నమ్మని చంద్రబాబు, అలీని అవసరానికి తగ్గట్టు వాడుకుని వదిలేశారన్నది రాజకీయ వర్గాల్లో ఇప్పటికీ విన్పిస్తోన్న అభిప్రాయం.

ఇక, ఇప్పుడు అలీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత. ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన అలీ, ఎన్నికల్లో పోటీ చేయలేదుగానీ, వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం విదితమే. మంత్రి పదవి హామీతోనే అలీ, వైసీపీలో చేరారని అప్పట్లో అంతా అనుకున్నారు. ‘అవునా.? అయితే, అది వస్తుంది..’ అంటూ మంత్రి పదవి విషయమై నర్మగర్భంగా వ్యాఖ్యానించారు అప్పట్లో అలీ.

అయితే, పరిస్థితులు మారాయి.. అలీని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పక్కన పెట్టారట. ముఖ్యమంత్రి అవగానే వైఎస్‌ జగన్‌, అలీనే కాదు.. చాలామందిని మర్చిపోయారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అలీ, తన సన్నిహితుల ద్వారా తనకు జరిగిన అన్యాయంపై మీడియాకి లీకులు పంపించారంటూ విన్పిస్తోన్న ప్రచారం సంగతి పక్కన పెడితే, తాజాగా మరో ఆసక్తికరమైన గాసిప్‌ రాజకీయ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తోంది అలీ గురించి.

అలీని ఎమ్మెల్సీగా చేయాలని వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారట. ఆ తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇస్తారట. అయితే, ఇదంతా జరగడానికి మరో ఆరు నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని సమాచారమ్‌. నిజమేనా.? అలీని బుజ్జగించే ప్రయత్నంలోనే వైసీపీ ఈ తరహా లీకులకు పాల్పడుతోందా.? అన్న అనుమానాలూ లేకపోలేదనుకోండి. అది వేరే విషయం.

అన్నట్టు, తన మిత్రుడు పవన్‌ కళ్యాణ్‌తో భేటీ అయ్యేందుకు అలీ ప్రయత్నిస్తున్నారన్నది మరో ఆసక్తికరమైన అంశమిక్కడ. అమెరికాలోనే పవన్‌ని కలిసేందుకు అలీ ఏర్పాట్లు చేసుకున్నారట. కానీ, అలీని ‘నమ్మకద్రోహి’గా ఇప్పటికే ప్రకటించేసిన పవన్‌, అలీని కలిసేందుకు అస్సలేమాత్రం సుముఖత వ్యక్తం చేయలేదట. అయినాగానీ, అలీ తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని అంటున్నారు.

రేపో మాపో అలీ, పవన్‌ని కలుస్తారనీ.. జనసేన వైపు వెళతారనీ జరుగుతున్న ప్రచారం దరిమిలా వైఎస్‌ జగన్‌ అప్రమత్తమయ్యారట. అదీ అసలు కథ. పోన్లే, పవన్‌ వైపు అలీ వెళ్తారేమో అన్న భయంతో వైఎస్‌ జగన్‌, అలీకి మంత్రి పదవి ఇస్తే.. అలా పవన్‌ వల్ల అలీ మేలు పొందినట్లవుతుందని సినీ వర్గాల్లో గుసగుసలు విన్పిస్తున్నాయి.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

Tollywood: ‘మిస్టర్.. మాట జారొద్దు..’ నటుడికి హీరోయిన్ ఘాటు రిప్లై

Tollywood: హీరోయిన్ నభా నటేశ్ (Nabha Natesh), నటుడు ప్రియదర్శి (Priyadarshi) మధ్య ట్వీట్ వార్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ‘హాయ్ డార్లింగ్స్.. ఎలా ఉన్నారు..!’ అంటూ ప్రభాస్...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Harish Shankar: చోటా కె.నాయుడుపై హరీశ్ శంకర్ ఆగ్రహం.. బహిరంగ లేఖ

Harish Shankar: టాలీవుడ్ (Tollywood) సీనియర్ స్టార్ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు (Chota K Naidu) పై బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగా...

Sandeep Reddy Vanga: బాలీవుడ్ నటుడిపై సందీప్ రెడ్డి ఆగ్రహం.. కారణం ఇదే

Sandeep Reddy Vanga: 5ఏళ్ళ క్రితం సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘కబీర్ సింగ్’ (Kabir Singh). సినిమాలో డీన్ పాత్ర పోషించిన బాలీవుడ్...