Switch to English

మద్యం రేట్లు పెరిగాయ్.. కాపురాలు కూలిపోతున్నాయ్‌.!

మీకు తెలుసా.? ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు పెంచడంతో, మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయ్‌.! ప్రభుత్వం ఫుల్‌ పేజీ పత్రికా ప్రకటనల్లో చెబుతున్నది ఇదే. మొన్నామధ్య ఎవరో ఏ మేధావి, జగనన్నకి పబ్లిసిటీ అంటే ఇష్టం వుండదనీ, ఫుల్‌ పేజీ ప్రకటనలు తమ ప్రభుత్వ హయాంలో వుండవనీ కారుకూతలు కూశారు. ఆ వెంటనే, మద్యం ధరలు పెంచేశాం.. మద్యం తాగేవాళ్ళని తగ్గించేశామంటూ తాజాగా పత్రికల్లో ఫుల్‌ పేజీ ప్రకటనలు వచ్చేశాయ్‌.

మద్యం తాగేవాళ్ళు తగ్గిపోయారా.? ఇది నిజమేనా.? గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితిని పరిశీలిస్తే.. కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో, కేంద్రం కావొచ్చు.. రాష్ట్ర ప్రభుత్వం కావొచ్చు.. పేదలకు కొంత ఆర్థిక సాయం చేస్తూ వస్తోంది. ఇలా మద్యం దుకాణాలు తెరిచారో లేదో అలా మందు బాబులు, ప్రభుత్వాలు ఇచ్చిన సొమ్ముల్ని పట్టుకుని మద్యం కొనుగోళ్ళు చేసేశారు. మొదటి రోజు పోటెత్తారు.. ఇది సహజంగానే జరిగేదే. కానీ, ఆ తర్వాత కాస్త నెమ్మదించారు. అదంతా మద్యం ధరలు పెంచడం వల్లనేనని ప్రభుత్వం చెబుతోంది. నవ్విపోదురుగాక మనకేటి.? అన్నట్టుంది కదూ కవరింగ్‌.!

ఇదిలా వుంటే, మద్యం ధరల్ని పెంచడంతో, మందు బాబులు విలవిల్లాడిపోతున్నారు. అలాగని తాగుడు మానేశారా.? అంటే అదీ లేదు. రాష్ట్రంలో నాటు సారా ఏరులై పారుతోంది. పొరుగు రాష్ట్రాల్లో లభిస్తోన్న మద్యం కిక్కు సంగతి సరే సరి. ఈ క్రమంలో అదనంగా మందుబాబులు ఖర్చు చేస్తున్నారన్నది నిర్వివాదాంశం. ఇదే నిజం కూడా.! అంతేగానీ, మద్యం తాగేవారి సంఖ్య తగ్గలేదు.

మద్యం అమ్మకాలు తగ్గాయంటే, దానికి కారణాలు చాలానే వుంటాయి. మద్యం అనేది దొరక్కపోతే తాగేవారి సంఖ్య తగ్గుతుంది. ఆ విషయం లాక్‌డౌన్‌తో నిరూపితమయ్యింది కూడా.! ఇక, మద్యం షాపుల్ని తగ్గిస్తే.. మద్యపానం తగ్గుతుందనడమూ హాస్యాస్పదమే. ఎందుకంటే, ఈ ఊరిలో దొరక్కపోతే, ఇంకో ఊరికి వెళ్ళి మరీ మద్యాన్ని సేవించేందుకు మందుబాబులు వెనుకడగు వేయరు. చూస్తున్నాం కదా, ఆంధ్రప్రదేశ్‌లో మద్యం షాపులు తెరవగానే ఇటు తెలంగాణ నుంచీ, అటు తమిళనాడు నుంచీ బోర్డర్‌ దాటొచ్చి మరీ మద్యం కొనుగోళ్ళు చేశారు మందుబాబులు.

అంతెందుకు, ఆంధ్రప్రదేశ్‌లో మద్యం రేట్లు పెరగడంతో, తెలంగాణ బోర్డర్‌లోకి ఎంటర్‌ అయి మరీ, మద్యం సేవిస్తున్నారు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మందుబాబులు. మద్యం రేట్ల పెరుగుదల కాపురాల్లో చిచ్చు పెడ్తోంది తప్ప, మందుబాబుల అలవాటుని తగ్గించే పరిస్థితే లేదు. ‘జగనన్న కుడి చేత్తో వెయ్యి రూపాయలిచ్చి, ఎడమ చేత్తో రెండు వేల రూపాయలు పట్టుకుపోతున్నాడు..’ అంటూ బాధిత కుటుంబాలు గగ్గోలు పెడుతున్నాయి.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

టీడీపీకి ఎన్టీఆరే దిక్కు.. కండిషన్స్‌ అప్లయ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు తరహాలోనే ఖాకీ రంగు దుస్తులు ధరించి, రాజకీయ తెరపై కన్పించాల్సిందేనా.? ఆ సమయం ఆసన్నమయ్యిందా.? అంటే, అవుననే అంటున్నారు టీడీపీలో చాలామంది...

రంజాన్‌ స్పెషల్‌: ఇండియాలో ఈద్‌ అల్‌ ఫితర్‌ ఎప్పుడంటే..

పవిత్ర రమదాన్‌ మాసం కొనసాగుతోంది. గతంలో కన్పించిన సందడి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా రమదాన్‌ సందర్భంగా కన్పించడంలేదంటే దానికి కారణం కరోనా వైరస్‌. ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌ డౌన్‌ని పాటిస్తున్న...

అత్యాచార ఘటనపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు

అత్యాచార ఘటనలపై ఒడిశా హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ సంఘటన జరిగిన పరిస్థితులపై పూర్తి వివరణ తీసుకున్న అనంతరం తీర్పు వెలువరించింది. నమ్మించి మోసం చేసాడని ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి అనుకూలంగా...

వైసీపీ రంగుల పైత్యం.. ఈసారీ ‘సర్కారు’ పప్పులుడకలేదంతే.!

ఓ గ్రామంలో ఓ వంద ఇళ్ళు వున్నాయనుకుందాం.. అందులో 30 ఇళ్ళో 40 ఇళ్ళో వైసీపీ మద్దతుదారులవో వున్నాయనుకుందాం.. వాటికి వైసీపీ రంగులేసుకోవచ్చు కదా.? ప్రభుత్వ కార్యాలయాలకే వైసీపీ రంగులేయాలని వైఎస్‌ జగన్‌...

క్రైమ్ న్యూస్: ప్రియురాలిని ఎర వేసి చెల్లి ప్రియుడిని చంపేసిన..

తన చెల్లిని ప్రేమించాడు అంటూ 19 యేళ్ల దినేశ్‌ను వంశీ చంపేశాడు. ప్రకాశం జిల్లా చీరాలలో ఈ సంఘటన జరిగింది. హరీష్‌ పేటకు చెందిన దినేశ్‌ కొన్నాళ్లుగా సంధ్యను ప్రేమిస్తున్నాడు. ఆమె కుటుంబ...