అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురంలో. ఇప్పటికే ఫిలిం సిటీ లో వేసిన సెట్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ని ప్యారిస్ లో ప్లాన్ చేసింది. వచ్చే నెల మొదటివారంలో టీమ్ పారిస్ వెళ్లనుంది. ఈ సినిమా విషయంలో ఇప్పటికే అటు ప్రేక్షకుల్లో కానీ, ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా టీజర్ కూడా విడుదల చేయకుండానే సినిమా బిజినెస్ మొత్తం కంప్లీట్ చేసినట్టు టాక్.
తాజగా ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను ఏకంగా 8.56 కోట్లకు అమ్మేసారు. అల్లు అర్జున్ కెరీర్ లో ఇదే హయ్యెస్ట్ ప్రైస్ ! బ్లూ స్కై అనే సంస్థ ఈ హక్కులను సొంతం చేసుకుంది. ఓవర్ సీస్ లో త్రివిక్రమ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ఆయన ఏ సినిమా చేసిన అక్కడ భారీ వసూళ్లు వస్తాయి. కేవలం ఓవర్ సీస్ హక్కులే కాకుండా నైజాం, సీడెడ్, తో పాటు కొన్న్ని ఆంధ్రా ఏరియా హక్కులు కూడా భారీ రేటుకు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఆలా వైకుంఠపురంలో అంటూ అచ్చ తెలుగు టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మాజీ గ్లామర్ హీరోయిన్ టబు కీ రోల్ పోషిస్తుంది.
నెక్స్ట్ షెడ్యూల్ ని ప్యారిస్ లో ప్లాన్ చేసారు. అక్కడ రెండు సాంగ్స్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట. అల్లు అర్జున్ సరసన పూజ హెగ్డే, నివేద పేతురేజ్ లు హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల చేయనున్నారు. నా పేరు సూర్య .. ప్లాప్ తరువాత చాల గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమా తరువాత అయన సుకుమార్ తో సినిమా చేయనున్నాడు.
