Switch to English

బర్త్ డే స్పెషల్: అక్కినేని సినీ వారసత్వాన్ని ఘనంగా చాటుతున్న ‘నాగచైతన్య’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,479FansLike
57,764FollowersFollow

కుటుంబానికి ఉన్న ఘనమైన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎవరికైనా ఒక సవాలు.. అంతకుమించి బాధ్యత. సినీ రంగంలో ఇది మరీ ఎక్కువ. అతితక్కువ కాలంలో పేరు, ప్రతిష్ట, డబ్బు వచ్చేది సినిమాల్లోనే. అయితే.. సొంత గుర్తింపు తెచ్చుకోవాలి.. వంశం పేరు నిలబెట్టాలి. తెలుగు సినిమాకు ఘన కీర్తిని తీసుకొచ్చిన వారిలో అక్కినేని నాగేశ్వరరావు ఒకరు. ఆయన లెగసీని తనయుడు నాగార్జున అంతే ఘనంగా నిలబెట్టారు. ఇప్పుడు మూడో తరం వచ్చింది. వీరిలో నాగ చైతన్య ఒకరు. అక్కినేని వంశ ప్రతిష్టను దశాబ్ద కాలంపైగా హిట్లు, ఫ్లాపులకు అతీతంగా తనదైన విభిన్న శైలిలో తాత, తండ్రి బాటలోనే తానూ ముందుకు సాగుతున్నాడు. తనదైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించి తనకంటూ ఒక మార్గాన్ని వేసుకున్న నాగచైతన్య పుట్టినరోజు నేడు.

కుటుంబాల సపోర్ట్ ఉన్నా..

నాగచైతన్యకు తెలుగు సినీ పరిశ్రమ ఉద్దండులైన అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల సపోర్ట్ ఉంది. కానీ.. నాగచైతన్య తనదైన మార్గంలో సక్సెస్ అయ్యాడు. జోష్ లో నటనతో తన స్కిల్స్ చూపితే.. ఏ మాయ చేశావే లో లవర్ బాయ్ గా మెప్పించాడు. 100 పర్సెంట్ లవ్ తో ఆ ఇమేజ్ కంటిన్యూ చేసి సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నాడు. వరుస సినిమా అవకాశాలతో తానేంటో నిరూపించుకున్నాడు. లెగసీ మొదటి సినిమా వరకే.. తర్వాత నిరూపించుకోవాలి అనే సినీ నానుడిని నాగచైతన్య చేసి చూపించాడు. ముఖ్యంగా నాగచైతన్యలో దర్శకులకు ఉన్న సౌలభ్యం ప్రేమమ్, మజిలీ సినిమాల్లో కనిపిస్తుంది. స్కూల్, కాలేజ్, ఫ్యామిలీ మ్యాన్ గా మూడు పాత్రల్లో కనిపించి ఆకట్టుకోవడం నిజంగా వరం. ఇలా మరొకరికి సాధ్యం కాలేదు. ఓబేబీ, మహానటి సినిమాల్లో అతిధి పాత్రలు చేసి మెప్పించాడు.

ఫ్యామిలీ ఇమేజ్..

ఇండస్ట్రీలో అగ్ర కుటుంబం నుంచి వచ్చినా సింప్లిసిటీ మెయింటెయిన్ చేస్తాడు నాగచైతన్య. వివాదాలకు చాలా దూరం. ఇది కూడా తాత, తండ్రి నుంచి వచ్చిన లక్షణమే. ఒకప్పుడు నాగేశ్వరరావు, తర్వాత నాగార్జున ఇప్పుడు నాగచైతన్య.. అజాతశత్రువులే. సినిమాలే వారి ప్రపంచం. రారండోయ్ వేడుక చేద్దాం, బంగార్రాజు, వెంకీ మామ సినిమాల్లో ఫ్యామిలీ జోనర్ టచ్ చేసి సక్సెస్ అయ్యాడు. మనంలో యువకుడి పాత్రలో తాత, తండ్రితో కలిసి నటించారు. మహానటిలో తాత అక్కినేని నాగేశ్వరరావుగా నటించి ఆయననే మరిపించాడని చెప్పాలి. రీసెంట్ గా హిందీలోనూ అమీర్ ఖాన్ తో నటించి మెప్పించాడు. ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. నాగచైతన్య సినీ కెరీర్ భవిష్యత్తులో కూడా సక్సెస్ ఫుల్ గా కొనసాగాలని కోరుకుంటూ బర్త్ డే విశెష్ చెప్తోంది ‘తెలుగు బులెటిన్’.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Tollywood: టాలీవుడ్ లో కలకలం.. కిడ్నాప్ కేసులో ప్రముఖ నిర్మాత..!

Tollywood: జూబ్లీహిల్స్ లోని క్రియా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించి కిడ్నాప్, షేర్ల బదలాయింపు కేసులో ప్రముఖ సినీ నిర్మాత నవీన్ యర్నేని...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా ‘సోలో...

Solo Boy: బిగ్ బాస్-7 కంటెస్టెంట్ గౌతమ్ కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘సోలో బాయ్’ (Solo Boy). ఈరోజు హీరో గౌతమ్ కృష్ణ (Gautham...

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

రాజకీయం

CM Jagan: సీఎం పై దాడి వివరాలిస్తే క్యాష్ ప్రైజ్.. బెజవాడ పోలీసుల ప్రకటన

CM Jagan: ఎన్నికల పర్యటనలో ఉండగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan mohan reddy) పై జరిగిన రాళ్ల దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పై...

పవన్ కళ్యాణ్ ఆవేశంలో నిజాయితీ, ఆవేదన మీకెప్పుడర్థమవుతుంది.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నిన్న తెనాలిలో ‘వారాహి యాత్ర’ నిర్వహించారు. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జనసేన అధినేత...

రాయి వెనుక రాజకీయం.! వైసీపీని వెంటాడుతున్న వైసీపీ నేతల వీడియోలు.!

ఓ కొడాలి నాని.. ఓ అంబటి రాంబాబు.. ఓ కన్నబాబు.. ఓ పెద్ది రెడ్డి రామచంద్రా రెడ్డి.. ఓ వల్లభనేని వంశీ.. ఇలా చెప్పుకుంటూ పోతే, లిస్టు చాలా పెద్దది. ఔను, చాలా...

Chandrababu: చంద్రబాబుపై రాళ్ల దాడి.. గాజువాకలో గందరగోళం

Chandrababu Naidu: ఎన్నికల నేపథ్యంలో గాజువాకలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu Naidu) చేపట్టిన ప్రజాగళం సభలో కలకలం రేగింది.  చంద్రబాబు ప్రసంగిస్తూండగా అగంతకులు కొందరు ఆయనపై రాళ్లు విసిరారు. దీంతో...

పవన్ కళ్యాణ్ పై రాయితో దాడి

ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన 'వారాహి' యాత్రలో స్వల్ప అపశృతి చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా తెనాలిలో పవన్ ప్రసంగిస్తుండగా.. గుర్తుతెలియని దుండగుడు ఆయనపై రాయి విసిరాడు. రాయి...

ఎక్కువ చదివినవి

Bengaluru: ‘రామేశ్వరం కెఫె బ్లాస్ట్’లో బాంబర్ అరెస్ట్.. పట్టించిన ‘టోపీ’

Bengaluru: బెంగళూరు (Bengaluru) లోని రామేశ్వరం కెఫె (Rameshwaram cafe) లో జరిగిన బాంబు పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా కీలక మందడుగు పడింది. ఇద్దరు ప్రధాన నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ...

Viral News: భారతీయుడి పేరుతో వెటకారం.. 10వేల డాలర్లు చెల్లించిన కెనడా కంపెనీ

Viral News: భారతీయుడి పేరును వెటకారంగా ప్రచురించిన కెనడా (Canada) కు చెందిన సంస్థ తగిన మూల్యం చెల్లించుకుంది. తీవ్ర విమర్శలు రావడంతో క్షమాపణలు కోరి 10వేల డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైంది. వివరాల్లోకి...

Janasena: ‘జనసేన’కు స్టార్ క్యాంపెయినర్లు.. ప్రకటించిన పవన్ కల్యాణ్

Janasena: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరిగిపోతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్ధుల ఎంపిక, ప్రకటనలు పూర్తయ్యాయి. దీంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. పార్టీ ముఖ్య నాయకులు ప్రచారంలో బిజీగా ఉంటున్నారు....

AP Assembly Polls: కులమే పాసుపోర్టా ?

ఏ రాజకీయ పార్టీకి అయినా కొన్ని సామాజిక వర్గాల వెన్నదన్నుగా ఉండటం అనేది సర్వసాధారణం అయినప్పటికీ రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతాల్లో సాంద్రత వున్న సామాజిక వర్గాలని తమ తమ...

తమ్ముడు పవన్ కళ్యాణ్ వెంటే అన్నయ్య చిరంజీవి.!

జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని అందించారు మెగాస్టార్ చిరంజీవి.! ఐదు కోట్లు.. అంటే, కేవలం రూపాయలు కాదు.! ఆశీస్సులు.! ఔను, జనసేన పార్టీకి మెగాస్టార్ చిరంజీవి అందించిన ఆశీస్సులు అవి. ‘నేను...