అక్కినేని ఫ్యామిలీ సభ్యులు నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పార్లమెంట్ హౌస్ లో కలిశారు. అక్కినేని నాగేశ్వర రావు 100వ జయంతి సందర్భంగా మహాన్ అభినేత అక్కినేని కా విరాట్ వ్యక్తిత్వ అనే బుక్ అక్కినేని నాగార్జున ప్రధానికి అందించారు .117వ మన్ కీ బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏఎన్నార్ గురించి ప్రస్తావించారు.
మన్ కీ బాత్ లో ఏఎన్నార్ గురించి మాట్లాడిన మోదీ ఆయన కేవలం నటుడే కాదు విద్యా, సాహిత్య, సేవా రంగాల్లో ఎంతో కృషి చేశారని వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించి తెలుగు చల చిత్ర పరిశ్రమకు ఎదుగుదలకు బలంగా నిలబడ్డారని అన్నారు నరేంద్ర మోదీ.
ప్రధాని మోడీ ఏఎన్నార్ గురించి మాట్లాడటంపై అక్కినేని ఫ్యామిలీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇక తాజాగా అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ లో ఏఎన్నార్ లెగసీ ఇంకా ఆయన స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా గురించి ప్రధాని మోదీ ప్రస్తావించడం మనసు సంతోషంతో నిండిపోయింది. ఈ గౌరవప్రదమైన గుర్తింపు మమ్మల్ని గర్వపడేల చేసిందని రాసుకొచ్చారు.

