Akira Nandan: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారా..? ఇందుకు యాక్టింగ్ కోర్స్ కూడా నేర్చుకుంటున్నారా..? అంటే అవుననే సమాధానమే వస్తోంది. పవన్ తొలి సినిమా ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి ముందు తనకు నటనలో శిక్షణ ఇచ్చిన గురువు సత్యానంద్ దగ్గరే అకీరా శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
హైదరాబాద్ లో శిక్షణ ప్రారంభమైనట్టు సమాచారం. దీనిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినా.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొన్నాళ్లుగా అకీరా సినీ ఎంట్రీపై పవన్ ఫ్యాన్స్ తోపాటు మెగా ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో ఈ వార్త వారిలో జోష్ నింపింది.
ఇటివలే అకీరా యాక్షన్ చేస్తున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. తండ్రి పవన్ నటిస్తున్న ఓజీ సినిమాలో అకీరా ఎంట్రీ ఇస్తున్నాడంటూ వార్తలు షికారు చేశాయి. ఇవన్నీ ఊహాగానాలేనని తెలుస్తోంది. అయితే.. అవి సత్యానంద్ శిక్షణలో భాగమేనా అని కూడా చర్చించుకుంటున్నారు.