అక్కినేని ఇంట వరుసగా శుభకార్యాలు జరుగుతున్నాయి. నాగచైతన్య ఇప్పటికే శోభితతో ఎంగేజ్ మెంట్ చేసుకుని పెళ్లికి రెడీ అవుతున్నాడు. డిసెంబర్ 4న వీరి పెళ్లి అన్న పూర్ణ స్టూడియోలో జరగబోతోంది. ఈ లోగానే నాగార్జున మరో గుడ్ న్యూస్ చెప్పాడు. అఖిల్ తన ప్రేయసి జైనబ్ రవ్జీతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నట్టు సడెన్ గా ప్రకటించాడు. దాంతో ఎవరీ జైనబ్ అని అందరూ సెర్చ్ చేస్తున్నారు. ఆమె పక్కా హైదరాబాదీ. ఆమె పుట్టింది హైదరాబాద్ లోనే.. కానీ పెరిగింది మాత్రం దుబాయ్, లండన్, ముంబై లాంటి ప్రదేశాల్లో.
ఆమె మొదటి నుంచి పెయింటర్ గా పాపులర్ అయింది. ఇప్పటికే ఎన్నో పెయింటింగ్ ప్రదర్శనలు ఇవ్వడంతో ఆమెకు చాలా పాపులారిటీ వచ్చింది. దాంతో పాటే ఎంఎఫ్ హుస్సేన్ దర్శకత్వంలో వచ్చిన ‘మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ థ్రీ సిటీస్’ మూవీలో కూడా యాక్ట్ చేసింది. ఆమెది బిజినెస్ ఫ్యామిలీ. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ కన్‌స్ట్రక్షన్ రంగంలో ఉండగా ఎన్నో వ్యాపారాలు చేస్తున్నాడు. ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ సలహాదారుడిగా కూడా పనిచేశాడు. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్ హోదాలో పనిచేశాడు.
జైనబ్ సోదరుడు జైన్ రవ్జీ జేఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కి ఛైర్మన్, ఎండీగా ఉన్నాడు. అతను కూడా కన్ స్ట్రక్షన్ వ్యాపారాలు చూసుకుంటున్నాడంట. రెండేళ్ల క్రితం నుంచే జైనబ్ తో అఖిల్ ప్రేమాయణం నడుస్తున్నట్టు తెలుస్తోంది.