అక్కినేని చిన్నోడు అఖిల్ పరిస్థితి మరి దారుణంగా మారింది. అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్సినా అఖిల్ కు వరుసగా మూడు పరాజయాలు టెన్షన్ పెట్టాయి. దాంతో కాస్త ఆచి తూచి నెక్స్ట్ సినిమా విషయంలో జాగ్రత్త పడుతున్న అఖిల్ తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ తో సినిమాకు కమిట్ అయ్యాడు.
పూజ కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా ఇంకా రెగ్యులర్ షూటింగ్ మొదలవ్వలేదు. దాంతో ఆ సినిమా విషయంలో అయోమయంలో పడ్డ అఖిల్ మరో సినిమాను సెట్ చేసే పనిలో బిజీగా మారాడు. అఖిల్ నెక్స్ట్ సినిమా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సెట్టయింది. తాజగా ఈ సినిమా విషయంలో నాగ్ కేర్ తీసుకుని, ఇప్పటికే పరశురామ్ తో కథా చర్చలు జరిపి .. స్టోరీ ని లాక్ చేసేసాడు.
Also Read: అక్కినేని అఖిల్‌కి లవర్ దొరికిందా? లేదా?
ఈ సినిమా కూడా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఉంటుందని టాక్. గీత గోవిందం లాంటి సూపర్ హిట్ సినిమా తరువాత పరశురామ్ మహేష్ బాబు తో ప్రయత్నాలు మొదలెట్టాడు కానీ అది వర్కవుట్ కాలేదు .. దాంతో అయన అఖిల్ కోసం ఓ సూపర్ కథను సిద్ధం చేసాడని, దాన్ని నాగార్జున కు వినిపించాడు. కథ నచ్చడంతో నాగ్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. ప్రస్తుతం స్క్రిప్ట్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సో త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుంది.
