అక్కినేని చిన్నోడు అఖిల్ హీరోగా నటించే నాలుగో సినిమాకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి .. రెగ్యులర్ షూటింగ్ ఇప్పటీకే మొదలైంది కూడా. బొమ్మరిల్లు సినిమాతో సంచలన దర్శకుడిగా ఇమేజ్ తెచ్చుకున్న భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరోయిన్ కోసం అన్వేషణ జరుగుతుంది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించినప్పటికీ .. ఎవరిని ఫైనల్ చేయలేదు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందట .. అందుకోసమే క్రేజీ హీరోయిన్ ని తీసుకోవాలని ప్లాన్ చేసారు. ఈ నేపథ్యంలో అఖిల్ కోసం హీరోయిన్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
ఇంతకీ అఖిల్ కోసం రంగంలోకి దింపే హీరోయిన్ ఎవరో తెలుసా .. పూజ హెగ్డే ! ఈ మధ్య టాలీవుడ్లో ఏ స్టార్ హీరో అయినా పూజా నే కావాలని అంటున్నారు. అందుకే ఈ అమ్మడికి వరుస అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ సరసన అరవింద సమేతలో నటించిన పూజ, మహేష్ తో మహర్షి లోనూ మెరిసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన నటిస్తున్న ఈ అమ్మడికి ఇప్పుడు అఖిల్ సినిమా ఛాన్స్ దొరికింది.
అఖిల్ సినిమాను వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తీ చేసి దసరా .. దీపావళి టైం లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. అఖిల్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేసిన ఏ సినిమా కూడా అయనను హీరోగా నిలబెట్టలేకపోయింది. మొదటి సినిమా అఖిల్, రెండో సినిమా హలో, మూడో సినిమా మిస్టర్ మజ్ను ఆశించిన స్థాయిలో అఖిల్ కి అందుకోలేదు .. అందుకే అయన బొమ్మరిల్లు భాస్కర్ ని లైన్ లోకి దింపారు.