అక్కినేని వారి ఇంట్లో వరుసగా శుభకార్యాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాగచైతన్య తన ప్రేయసి శోభితను పెళ్లి చేసుకున్నాడు. చైతూ పెళ్లి సమయంలోనే అఖిల్ కు జైనబ్ రవ్జీల ఎంగేజ్ మెంట్ జరిగినట్టు నాగార్జున ప్రకటించారు. అత్యంత సీక్రెట్ గా వీరి ఎంగేజ్ మెంట్ జరిగిపోయిందని వార్తలు వచ్చాయి. అయితే వారి పెళ్లి మాత్రం గ్రాండ్ గానే చేస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే పెళ్లి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ గుడ్ న్యూస్ బయటకు వచ్చింది. మార్చి 24న అన్నపూర్ణ స్టూడియోలో వీరి వివాహం ఉండబోతున్నట్టు సమాచారం. ఈ విషయాన్ని జాతీయ మీడియా కన్ఫర్మ్ చేస్తోంది.
వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు. గుర్రపు స్వారీ కోసం వెళ్లిన దగ్గర వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. పైగా జైనబ్ కుటుంబం కూడా వ్యాపారంలో కీలకంగా ఉంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర దేశాల్లో కూడా వారికి కంపెనీలు ఉన్నాయి. జైనబ్ తండ్రి కూడా నాగార్జునకు ఫ్యామిలీ ఫ్రెండ్. వీరిద్దరూ వ్యాపారాల్లో పార్ట్ నర్స్ అని కూడా అప్పట్లో టాక్ వచ్చింది. ఇక పెళ్లి వేడుకను అక్కినేని ఫ్యామిలీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం అఖిల్ రెండు సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నాడు. ఇక ఇద్దరు కొడుకులు మళ్లీ పెళ్లి చేసుకోవడంతో నాగార్జున ఫ్యామిలీ చాలా సంతోషంగా ఉంది.