అఖండ2 కోసం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నా, ఈ సినిమా రిలీజ్‌కు ముందు ఎదురవుతున్న సమస్యలు మాత్రం ముగిసేలా కనిపించడం లేదు. ఇప్పటికే అనుకోని పరిస్థితుల మధ్య వాయిదా పడిన ఈ మూవీ, మళ్లీ థియేటర్లకు రావడానికి ప్రయత్నిస్తూనే కొత్త కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
తాజా సమాచారం ప్రకారం, మేకర్స్ గతంలో ఉన్న కొన్ని ఫైనాన్షియల్ క్లియర్ చేసుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ, వాటిలో చాలావాటికి ఇంకా ఫైనల్ పరిష్కారం రాలేదన్న టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఎరోస్ సంస్థకు సంబంధించిన బకాయిల వ్యవహారం ఇంకా మేకర్స్‌ను ఇబ్బంది పెడుతోందని తెలుస్తోంది.
ఎరోస్ వైపు నుండి ప్రస్తుతం ఉన్న అప్పులో కనీసం సగం మొత్తాన్ని వెంటనే చెల్లించాల్సిందేనని, మిగిలిన మొత్తానికి ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దల నుండి బలమైన హామీ ఉంటేనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తామని వారు చెప్పినట్లుగా సమాచారం. ఈ షరతులు మేకర్స్‌కు మరింత ఒత్తిడిని తీసుకొచ్చాయి.
సినిమా రిలీజ్ కోసం వీలైనన్ని మార్గాల్లో ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ, ప్రతి దశలోనూ ఏదో ఒక సవాలు ముందుకొస్తూనే ఉంది. ఇంతలోనే టీమ్‌కు దగ్గరి వర్గాల సమాచారం ప్రకారం, మేకర్స్‌కు సపోర్టుగా టీమ్‌లోని ప్రముఖులు. హీరో బాలయ్య , దర్శకుడు బోయపాటి శ్రీను.. తమ రెమ్యునరేషన్‌లో భాగం తిరిగి ఇవ్వడానికి సిద్ధమయ్యారట. మిగిలిన మొత్తం బయ్యర్లతో చర్చల ద్వారా సర్దుబాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట.
సోమవారం ఈ మొత్తం వివాదంపై స్పష్టత వచ్చే అవకాశం ఉండగా, అఖండ2 రిలీజ్‌పై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరిస్థితులన్నీ సర్దుకుంటేనే మూవీ థియేటర్లలో ప్రేక్షకులను పలకరించే అవకాశం ఉంది.
